EPAPER

Niroshan Dickwella: అడ్డంగా దొరికిన క్రికెటర్, వేటు వేసిన శ్రీలంక బోర్డు

Niroshan Dickwella: అడ్డంగా దొరికిన క్రికెటర్,  వేటు వేసిన శ్రీలంక బోర్డు

Niroshan Dickwella: ఆటల్లో రాణించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు ఆటగాళ్లు. ఆట ఏదైనా తన టాలెంట్ నిరూపించుకోవడమే అసలు టార్గెట్. ఈ క్రమంలో చేయరాని తప్పులు చేసి అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా డోపింగ్ టెస్టులో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో శ్రీలంక బోర్డు అతడిపై వేటు వేసింది.


ఇటీవల లంక ప్రీమియర్ లీగ్-ఎన్‌పీఎస్ పోటీల సందర్భంగా ఆటగాళ్లకు డోపింగ్ టెస్టు నిర్వహించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. అందులో లంక వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా అధిక మోతాదులో నిషిద్ద ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. టెస్టులో అతడికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈ క్రమంలో ఆటగాడిపై శ్రీలంక కోర్టు సస్పెన్షన్ విధించింది. ఈ మేరకు లంక బోర్డు ఓ ప్రకటన కూడా చేసింది.

31 ఏళ్ల క్రికెటర్ చివరిసారిగా గతేడాది మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో ఆడాడుకానీ, సరైన ప్రదర్శన చేయలేక పోయాడు. సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వచ్చింది. తదుపరి నోటీసు వచ్చేవరకు అలాగే కొనసాగ నుందని లంక మీడియా తెలిపింది. 2021లో ఇంగ్లాండ్ టూర్‌లో సెక్యూరిటీ ఉల్లంఘించాడు. దీంతో  డిక్వెల్లాను సస్పెండ్ చేసింది.


ALSO READ: కోర్టు తీర్పుపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ వైరల్ పోస్ట్

నిరోషన్ డిక్వెల్లా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తన కెరీర్‌లో 54 టెస్టులు (సగటు-2757 పరుగులు), 55 వన్డేలు (1604 పరుగులు), 28 టీ-20 మ్యాచ్‌ (480 పరుగులు)లు ఆడాడు. వన్డేల్లో రెండు సెంచరీలు, టెస్టుల్లో 20కి పైగానే హాఫ్ సెంచరీలున్నాయి. గతేడాది ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×