EPAPER

Paris Paralympics 2024: లక్ష్యాన్ని దాటి.. దూసుకుపోతున్న భారత్

Paris Paralympics 2024: లక్ష్యాన్ని దాటి.. దూసుకుపోతున్న భారత్

Confident of India winning over 25 medals at Paris Paralympics 2024 Devendra Jhajharia: పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో లక్ష్యాన్ని దాటి భారత్ దూసుకుపోతోంది. విశ్వ క్రీడావేదికపై అడుగుపెట్టేటప్పుడే పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా ఏమన్నారంటే.. ఈసారి మేం 25 పతకాలకన్నా ఎక్కువ సాధిస్తామని అన్నారు. అంతేకాదు మా అథ్లెట్లపై నాకంత నమ్మకం ఉందని ఆత్మ విశ్వాసంతో చెప్పారు.


అన్నట్టుగానే మన అథ్లెట్లు 25 పతకాల లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటం, ఇంకా పతకాల పోటీల్లో మనవాళ్లు రేస్ లో ఉండటంతో మరో 5 పతకాలైనా వస్తాయని అంటున్నారు. మరికొందరు అన్ని కాకపోయినా 25 ని దాటడమైతే గ్యారంటీ అంటున్నారు.

ఈ స్థాయిలో భారత అథ్లెట్లు పోటీ పడుతున్నారంటే.. గత మూడేళ్లుగా వారు పడిన కఠోర శ్రమే అందుక్కారణమని అంటున్నారు. వారందరూ ఎంతో నిబద్ధతతో నేర్చుకున్నారు. వారు శారీరక, మానసిక వికలాంగులైనా సరే, కొండంత పట్టుదల వారిలో ఉందని అధ్యక్షుడు దేవేంద్ర తెలిపారు.


అంతేకాదు విదేశీ కోచ్ ల ద్వారా ప్రణాళికబద్దంగా శిక్షణ పొందారని తెలిపారు. అలాగే భారత ప్రభుత్వం వారికోసం అత్యున్నత క్రీడా పరికరాలను, వారికి ప్రమాదం లేనివి అందించారని తెలిపారు. వాటి ఫలితమే నేడు పతకాలు వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్ లో 19 పతకాలు సాధించడంతో సాయ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో బడ్జెట్ రూ. 19 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పెరిగింది.

Also Read: పారాలింపిక్స్: టార్గెట్ కి దగ్గరలో భారత్

పతకాల వేటలో భారత అథ్లెట్లు ఆకలిమీదున్న పులుల్లా బరిలో రెచ్చిపోతున్నారు. మనవాళ్ల ఆత్మవిశ్వాసం ముందు ప్రత్యర్థులు డీలా పడిపోతున్నారు. కొన్ని పోటీలైతే ఏకపక్షంగా సాగిపోతున్నాయి. ఫైనల్ వరకు వచ్చిన ప్రత్యర్థులు భారత అథ్లెట్ల ధాటికి తల వంచుతున్నారు. ఇప్పటికి 5 స్వర్ణం, 9 రజతాలు, 11 కాంస్యం.. మొత్తం 25 పతకాలతో 16వ స్థానంలో నిలిచింది.

తాజాగా పురుషుల 60 కిలోల జూడోలో యువ జూడోకా కపిల్‌ పర్మర్‌ మూడో స్థానంలో నిలవడంతో పారిస్‌లో 25 పతకాలతో భారత్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీంతో 25 పతకాల టార్గెట్ చేరుకున్న కపిల్ ను అందరూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. సగర్వంగా ఇండియా తిరిగి వెళ్లేలా చేశావని కొనియాడుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×