EPAPER

world’s largest cricket stadium: గుజరాత్‌ను తలదన్నేలా.. కోయంబత్తూరులో బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం..

world’s largest cricket stadium: గుజరాత్‌ను తలదన్నేలా.. కోయంబత్తూరులో బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం..

world’s largest cricket stadium: దేశంలో చాలా రాష్ట్రాలు ఈ మధ్య ఆటలపై దృష్టిపెట్టాయి. ఏపీ, తెలంగాణ, ఒడిషా, తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని స్టాలిన్ సర్కార్ భావిస్తోంది. డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లను ఆహ్వానిస్తోంది.


ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనగానే గుజరాత్‌లోని మోతేరా స్టేడియం గుర్తుకు వస్తుంది. అక్కడ లక్షా 32 వేలమంది కూర్చుని మ్యాచ్‌ని చూసేలా నిర్మించారు. ఇంత కెపాసిటీ స్టేడియం ఎక్కడా లేదు. దీన్ని తలదన్నేలా తమిళనాడు ప్రభుత్వం అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను సిద్ధం చేసింది.

కోయంబత్తూర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రూప కల్పన చేసింది. ఆ సిటీకి 16 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేడియాన్ని నిర్మించనుంది. తమిళనాడులోని సేలం- కేరళలోని కొచ్చిన్ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుం దని భావిస్తోంది స్టాలిన్ సర్కార్. ఆ ప్రాంతానికి అంతర్జాతీయంగా ఫోకస్ అవుతుందన్నది ప్రభుత్వ ఆలో చన. ప్రస్తుతం అక్కడ తమిళనాడు జైళ్ల శాఖకు చెందిన భూమి ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాలు ఉంది. దీనికితోడు 198 ఎకరాలను సేకరించాలనే ఆలోచనలో ఉంది.


ALSO READ: పివి సింధు రికార్డ్ బ్రేక్.. ఒలింపిక్స్ లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అరుదైన ఫీట్!

కొత్తగా నిర్మించబోయే ఈ స్టేడియంలో ఆటగాళ్లు, ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించా లనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆటగాళ్లకు లాంజ్, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సెంటర్‌తో‌పాటు వీఐపీలకు కార్పొ రేట్ స్థాయి సదుపాయాలు కల్పించాలన్నది ఆలోచన. అభిమానులకు రెస్టారెంట్లు వంటివి ఈ ప్లాన్‌లో ఒక భాగం. గ్యాలరీలతోపాటు ప్రత్యేకంగా క్రికెట్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారట.

కేవలం మ్యాచ్‌ల కోసం మాత్రమే కాకుండా ఆటగాళ్లు, అంపైర్లు, సాంకేతిక టెక్నాలజీ, కోచ్‌ల కోసం పరి శోధన కేంద్రం ఇందులో ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పించడమే ఈ స్టేడియం ముఖ్యఉద్దేశం. మొత్తానికి రాబోయే రోజుల్లో కొయంబత్తూరు సిటీని క్రికెట్ ఐకాన్‌గా చూడడం ఖాయమన్నమాట.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×