EPAPER

CM Revanth Reddy, Venkatesh At Uppal Stadium: సీఎం రేవంత్ రెడ్డి, వెంకటేష్, చిరంజీవి ప్రముఖుల రాక..

CM Revanth Reddy, Venkatesh At Uppal Stadium: సీఎం రేవంత్ రెడ్డి, వెంకటేష్, చిరంజీవి ప్రముఖుల రాక..

venkatesh revanth reddy at uppal stadiumCM Revanth Reddy , Venkatesh And Chiranjeevi at Uppal Stadium CSK vs SRH :హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ప్రముఖులు అందరూ తరలివచ్చారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరు కావడంతో వాతావరణం సందడిగా మారింది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమైన రాత్రి 7.30 గంటలకు ఆయన స్టేడియానికి వచ్చారు. స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డిని చూసి అభిమానులు ఒక్కసారి రెచ్చిపోయారు. సీఎం సీఎం అంటూ అరుపులు, కేకలతో హడావుడి చేశారు.  అలా క్రీడా మైదానంలో కూడా  పొలిటికల్ వాతావరణం స్రష్టించారు.


మరోవైపు మ్యాచ్ చూసేందుకు సెలబ్రిటీలు వచ్చారు. వారిలో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఆయన్ని చూసిన అభిమానులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. మెగాస్టార్ అంటూ హంగామా చేశారు. ఇక క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే హీరో వెంకటేష్ కూడా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, వెంకటేష్ వీరంతా పక్కపక్కనే కూర్చున్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం వచ్చి కాసేపు అందరినీ నవ్వించారు. ఇక సీఎం వస్తున్నారంటే, మిగిలిన పొలిటికల్ లీడర్లు ఊరుకుంటారా? ఆ మెహర్బానీ బ్యాచ్ అంతా కూడా ఆయనతోపాటే వచ్చారు. వారి హడావుడి వారిదన్నట్టు మారిపోయింది.


ఇంక మ్యాచ్ చూసిన వారిలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తదితరులు ఈ మ్యాచ్ తిలకించారు.  ఇకపోతే ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉప్పల్ స్టేడియం 4వ గేట్ వద్ద తీవ్రంగా తోపులాట జరిగింది. అక్కడ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ వస్తున్నాడని తెలిసి అభిమానులు అందరూ అటు పరుగెత్తారు. వీరిని నిలువరించడం పోలీసుల వల్ల కాలేదు. మొత్తానికి ఒకొక్కరిని స్టేడియంలోకి వదిలారు. చివరికి కథ సుఖాంతమైంది.

సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో మ్యాచ్ చూద్దామని అనుకుంటున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. అందుకే ఈసారి వచ్చారని అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి సీఎం రావడంతో మ్యాచ్ లకి ఒక కలరింగ్ వచ్చింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×