EPAPER

Cricket Player Siraj: భారత క్రికెట్‌ ప్లేయర్‌ సిరాజ్‌ని సన్మానించిన సీఎం

Cricket Player Siraj: భారత క్రికెట్‌ ప్లేయర్‌ సిరాజ్‌ని సన్మానించిన సీఎం

CM Revanth Reddy Honored Mohammad Siraj: టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ టీమ్ తరుపున పాల్గొన్న ఇండియన్‌ స్టార్‌ బౌలర్‌ హైదరాబాద్‌కి చెందిన మహ్మద్‌ సిరాజ్ ప్రపంచకప్‌ గెలుచుకున్న అనంతరం శుక్రవారం హైదరాబాద్‌కి వచ్చిన సిరాజ్‌కి మెహిదీపట్నం దారిపొడువున అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్‌ కప్ గెలుచుకున్న సిరాజ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సిరాజ్‌ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సిరాజ్‌కి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి, నందిని బహూకరించారు. అనంతరం ప్రపంచకప్‌ మియాన్‌ మెడలో వేసి సీఎం ప్రశంసించారు. ఆ తరువాత సీఎం రేవంత్‌ రెడ్డికి తన టీమిండియా జెర్సీని బహూకరించాడు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటుగా రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటిలతో పాటు హైదరాబాద్‌కి చెందిన కాంగ్రెస్ నేత టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


ఇక ఇదిలా ఉంటే భారత క్రికెట్‌ దిగ్గజ ప్లేయర్ సిరాజ్‌ అమెరికా వెస్టిండిస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ప్రతిభ కనబరిచి భారత క్రికెట్‌ చరిత్రలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్నారు భారత టీమ్‌.ఇక ఈ టోర్నీలో సిరాజ్ ఒకే ఒక్క వికెట్‌ తీసి తనవంతు బాధ్యతను వహించాడు. అంతేకాకుండా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత క్యాచ్‌తో మెరిసి అందరి చూపు సిరాజ్ వైపు చూసేలా చేసుకున్నాడు. అంతేకాదు ఫైనల్లో తుదిజట్టులో మాత్రం ఈ హైదరాబాదీ పేసర్‌కి ఆడే ఛాన్స్‌ రాలేదు. ఐసీసీ టైటిల్‌ని కైవసం చేసుకున్న టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో వాన కారణంగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గుముఖం పడ్డాక తిరిగి ఇండియాకు తిరిగివచ్చారు.

Also Read: వింబుల్డన్.. ప్రేక్షకులపై జకోవిచ్ ఆగ్రహం, అసలేం జరిగింది?


వీరు ఇండియాకు చేరుకోగానే క్రికెట్‌ అభిమానులు భారీగా చేరుకొని టీమిండియాకు ఘనస్వాగతం పలికారు. భారత ప్రభుత్వం సైతం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్త్‌ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు ఘనస్వాగతం పలికింది. అనంతరం భారత ప్రధాని మోదీని భారత క్రికెట్‌ టీమ్‌ కలిసింది. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లతో కలిసి సిరాజ్ ప్రధాని మోదీ ఇచ్చిన ఆతిథ్య విందులో పాల్గొన్నాడు. అనంతరం తన స్వస్థలం హైదరాబాద్‌కి తిరిగి వచ్చి నగరవాసులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×