EPAPER

Paris Olympics 2024: ఒకటి కొట్టిన స్వప్నిల్ కి కోటి నజరానా.. మరి రెండు కొట్టిన మను బాకర్ కి సున్నా..

Paris Olympics 2024: ఒకటి కొట్టిన స్వప్నిల్ కి కోటి నజరానా.. మరి రెండు కొట్టిన మను బాకర్ కి సున్నా..

CM Eknath Shinde Announces Rs 1 cr for Kusale(Sports news headlines): పారిస్ ఒలింపిక్స్ షూటింగులో.. ఒక్క కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కు సాలేకు కాసుల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కోటి రూపాయల బహుమతిని ప్రకటించారు. అయితే దురద్రష్టం ఏమిటంటే, అదే స్థాయిలో మను బాకర్ కి ప్రశంసలు తప్ప డబ్బులు రాలడం లేదు.


హర్యానా ప్రభుత్వం ఈ విషయంపై ఏమీ స్పందించడం లేదు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని మాత్రం అభినందనలు తెలిపారు. మీరు మా రాష్ట్రంలో జన్మించడం మాకేకాదు, దేశానికే గర్వ కారణమని అన్నారు. అంతేకాదు ఒలింపిక్ గేమ్స్ ముగిసిన తర్వాత మీ రాక కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. మీకు స్వాగత సత్కారాలు ఘనంగా ఏర్పాటు చేస్తామని, మంచి విందు భోజనం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారతదేశానికి రెండు పతకాలు సాధించిన మను బాకర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇలా స్పందించడం దారుణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలామంది ఇంతకుముందు గొడవను గుర్తు చేస్తున్నారు.


గతంలో కూడా ఇలాగే మనుబాకర్ ఇతర క్రీడల్లో స్వర్ణ పతకం సాధిస్తే, హర్యానా ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. చాలాకాలం తర్వాత ఆ డబ్బులు విడుదల కాకపోవడంతో మను బాకర్ ఎక్స్ వేదికగా స్పందించింది. దీంతో పెద్ద వివాదం రేగి, రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలైంది. బహుశా ఇది మనసులో పెట్టుకుని మను బాకర్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందా? అనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

Also Read: నా ప్రయత్నం చేశా, అదృష్టం లేదంతే: సింధూ

పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటివరకు షూటింగులోనే మూడు కాంస్య పతకాలు వచ్చాయి. 10 మీ ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ లో ఒకటి, మిక్స్ డ్ డబుల్స్ లో మరొకటి కలిపి, రెండు కాంస్య పతకాలు మను బాకర్ ఖాతాలో ఉన్నాయి. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే తొలిసారిగా ఒలింపిక్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

మను బాకర్ పై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, కేంద్ర క్రీడల మంత్రి మన్ సుఖ్ మాండవీయ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ప్రియాంక ఇలా ఎందరో ప్రశంసలు కురిపించారు. సొంత రాష్ట్రమైన హర్యాణా మాత్రం మంచి భోజనం పెడతాం రండి.. అని చెప్పడం వివాదాస్పదమైంది. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారిణికి ఇచ్చే మర్యాదా? ఇదేనా? అని నెటిజన్లు, మాజీలు మండిపడుతున్నారు.

Related News

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Big Stories

×