EPAPER
Kirrak Couples Episode 1

Chocolate ban in IPL : ఐపీఎల్‌లో చాక్లెట్ బ్యాన్.. పాపం ఆ ఆటగాడికే ప్రత్యేకమైన శిక్ష

Chocolate ban in IPL : ఐపీఎల్‌లో చాక్లెట్ బ్యాన్.. పాపం ఆ ఆటగాడికే ప్రత్యేకమైన శిక్ష
Chocolate ban in IPL

Chocolate ban in IPL : క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. టెస్ట్ క్రికెట్‌లో రోజంతా గ్రౌండ్‌లోనే ఉండాలి. వన్డేల్లోనూ అంతే. ఇక ఐపీఎల్‌లో గ్రౌండ్‌లో ఉండేది నాలుగు గంటలే అయినా.. ఆ స్ట్రెస్ వేరు. సో, ఇష్టమొచ్చిన తిండి తింటామంటే కుదరదు. అందుకే, ఫిట్‌నెస్ కోసం చాక్లెట్ బ్యాన్ చేశారు. అందరికీ కాదనుకోండి.. కేవలం శ్రీలంక ప్లేయర్ భానుక రాజపక్సకు మాత్రమే ఈ ఆఫర్. ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న ఈ బ్యాట్స్‌మెన్.. బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు.


2022 ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 13 సిక్సులు ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన రాజపక్స.. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పోయిన సీజన్‌లో 50 లక్షలు పెట్టి కొన్నందుకు బాగానే న్యాయం చేశాడు. కాని, ఐపీఎల్‌లోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా శ్రీలంక కోచ్ మైకీ ఆర్థర్.. భానుక రాజపక్స విషయంలో చాలా అసంతృప్తితో ఉండేవాడు. అప్పట్లో భానుక బాడీ వెయిట్ చాలా ఎక్కువగా ఉండేది. ఫిట్ నెస్ మీద ఏమాత్రం శ్రద్ధ ఉండేది కాదు. ఒక క్రికెటర్ అయి ఉండి చాక్లెట్లను విపరీతంగా తినేవాడు. అలాంటి భానుకకు కంప్లీట్‌గా మార్చేశాడు మైకీ ఆర్థర్.

బాడీలో ఫ్యాట్ ఎంతుందో తెలుసుకోడానికి స్కిన్ ఫోల్డ్ టెస్ట్ పెడతారు. ఇది చాలా కామన్. ఒకానొక దశలో భానుక రాజపక్స్ స్కిన్ ఫోల్డ్ రీడింగ్ 104 ఉంది. ఏం చేస్తావో తెలీదు.. దీన్ని 70కి తీసుకురావాలని షరతు పెట్టాడు కోచ్ ఆర్థర్. ఫిట్ నెస్ ట్రైనర్లు కూడా ఇది సాధ్యమేనా అని సందేహించారు. కానీ, మైకీ వదల్లేదు. ఎంతలా అంటే రెండు కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల 33 సెకన్లలో పూర్తిచేసేంతగా పరిగెత్తించాడు. అలా వెయిట్ తగ్గించాడు. ఇందుకోసం జీవితంలో చాక్లెట్ ముట్టకూడదని, ఓ బ్యాన్ విధించాడు. దాని ఫలితంగానే.. శ్రీలంక క్రికెట్‌లో బాగా రాణించాడు. ఇండియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మెరుగ్గా ఆడాడు. అప్పుడు అలా ఆడాడు కాబట్టే.. లాస్ట్ సీజన్‌లో ఐపీఎల్‌లోకి రాగలిగాడు. మొత్తానికి చాక్లెట్ బ్యాన్.. భానుక రాజపక్సను మంచి ఆటగాడిగా నిలబెట్టింది.


Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×