EPAPER

Rishabh Pant : చెన్నై కింగ్ ధోనీ ప్లేస్ లో.. పంత్ ?

Rishabh Pant : చెన్నై కింగ్ ధోనీ ప్లేస్ లో.. పంత్ ?

Rishabh Pant : మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులోనే ఒక విద్వత్తు ఉంది. తను టీమ్ లో ఉంటే చాలు, అంతా తను చూసుకుంటాడనే భరోసా ఉంటుంది. క్రికెట్ పై తనకున్న పరిజ్ణానం సామాన్యమైనది కాదు. ఇలాంటి ధోనీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం ఇంకా ప్రకటించలేదు. తను మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్నాడు. అలాగే ఐదు సార్లు ట్రోఫీని అందించాడు.


ఇప్పడు ధోనీ వయసు 43 సంవత్సరాలు. ప్రస్తుతం మోకాలి నొప్పులతో బాధపడుతున్నాడు. నిజానికి 2024 ఐపీఎల్ సీజన్ లోనే రిటైర్ కావాలి. కానీ మేనేజ్మెంట్ ఒత్తిడి మేరకు ఆడాడు. అయితే కెప్టెన్ గా కాకుండా ఆటగాడిగా ఆడాడు. తన ఆధ్వర్యంలోనే రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ చేసి, దగ్గరుండి మెళకువలన్నీ నేర్పాడు. ఈ ఏడాది తనింకా ఐపీఎల్ విషయంలో నిర్ణయం చెప్పలేదు. ఉంటాడా? ప్రత్యక్ష క్రికెట్ నుంచి పూర్తిగా బయటకు వస్తాడా? అనేది తేలలేదు.

Also Read : “నాడు తిట్టినవారే.. నేడు పొగుడుతున్నారు”


ఒకవేళ తను ఆడకపోతే, ధోనీ శిష్యుడైన రిషబ్ పంత్ ని సీఎస్కే తీసుకురావాలని చూస్తోంది. ప్రస్తుతం రిషబ్ పంత్ అయితే ఢిల్లీ కెప్టెన్ గా ఉన్నాడు. అలాగైతే పంత్ ని వదులుకోవడానికి ఢిల్లీ రెడీగా ఉందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అంతటి ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మొదట నమ్మకం ఉంచి, తనపై గౌరవం ఉంచి, తిరిగి కెప్టెన్సీ అందించిన ఫ్రాంచైజీకి నిజంగా పంత్ కృతజ్ఞతలు చెప్పాలి. తనక్కడ ఆడిన ఆటని చూసే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏకంగా టీ 20 ప్రపంచకప్ నకు ఎంపిక చేసింది. అన్నట్టుగానే తను ఫస్ట్ డౌన్ లో వచ్చి చక్కగా ఆడటమే కాదు, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిప్పుడు రిషబ్ పంత్.. సీఎస్కేకి వస్తే, ఆల్రెడీ కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితేమిటి? అన్నది ప్రశ్నగా ఉంది. మరి తనని తప్పించి పంత్ ని కెప్టెన్ చేస్తారా? అలాగైతే రుతురాజ్ గైక్వాడ్ వేరే ఫ్రాంచైజీని చూసుకుంటాడా? అనే డౌట్లు నెటిజన్లను పట్టి పీడిస్తున్నాయి. ఆఖరిగా ట్విస్ట్ ఏమిటంటే ఇవన్నీ జరగాలంటే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలి. లేదంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్టు, ఏ జట్టులో వారు ఆ జట్టులోనే యథాతథంగా ఉంటారు. ఇదండీ సంగతి.

 

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×