EPAPER

#16YearsOfVirat: విరాట్ కొహ్లీకి.. పదహారేళ్లు!

#16YearsOfVirat: విరాట్ కొహ్లీకి.. పదహారేళ్లు!

Celebrating 16 years of Virat Kohli’s brilliance in International Cricket: ఆరోజు.. ఆగస్టు 18, 2008వ సంవత్సరం
నేటికి కరెక్టుగా 16 ఏళ్లయ్యింది.
ఇండియన్ క్రికెట్ లో ఒక యువతార తళుక్కుమని మెరిసింది.
శ్రీలంకలోని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం..
ఆరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే మ్యాచ్ జరుగుతోంది.
తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఆ యువతార మరెవరో కాదు.. టీమ్ ఇండియన్ స్టార్ క్రికెటర్, దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచే ఇండియన్ కింగ్ విరాట్ కొహ్లీ..
అప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ మరెవరో కాదు..
ద గ్రేట్ లెజండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ


తను కెప్టెన్ మాత్రమే కాదు.. టీమ్ ఇండియాకి మెరికల్లాంటి ఆటగాళ్లు ఎందరినో అందించాడు. అయితే, ఆ రోజున తన తొలి మ్యాచ్ లో విరాట్ కొహ్లీ ఓపెనర్ గా అడుగుపెట్టాడు. అయితే అప్పుడు తన సహచర ఓపెనర్ మరెవరో కాదు.. ప్రస్తుత టీమ్ ఇండియా కోచ్ గౌతం గంభీర్.. ఆ రోజు మ్యాచ్ లో గంభీర్ డకౌట్ అయ్యాడు. విరాట్ మాత్రం తొలి మ్యాచ్ లో 22 బంతులాడి 1 ఫోర్ కొట్టి 12 పరుగులు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

అందరిలాగే ఒక కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడని అంతా అనుకున్నారు. తను మొదటి మ్యాచ్ లో ఆకట్టుకోలేదు. కానీ తనలోని ప్రతిభను మొదట గుర్తించిన వాడు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. తను విఫలమైనా సరే, అవకాశాలిస్తూ వెళ్లాడు. అలా  నాడు చిన్నమొక్కగా మొదలైన విరాట్ కొహ్లీ ప్రయాణం నేడు మహావ్రక్షంలా టీమ్ ఇండియాలో ఎదిగిపోయాడు. టీమ్ ఇండియాకి వెన్నెముకలా మారిపోయాడు.


జాతీయ జట్టులో విరాట్ కొహ్లీ 16 ఏళ్ల ప్రయాణం.. అలుపెరగకుండా సాగిపోయింది. ఇన్నేళ్లలో గాయపడి ఒక్క మ్యాచ్ కి కూడా తను దూరం కాలేదు. నిరంతరం ఆడుతూనే ఉన్నాడు. ఆడుతూనే ఉన్నాడు. పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఒక రన్ మిషన్ లా మారిపోయాడు. అయితే కొడుకు అకాయ్ పుట్టే సమయంలో మాత్రం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు.

అంతే.. ఆరోజు నుంచి నేటి వరకు అలుపెరగకుండా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో రికార్డులు, ఎన్నో అవార్డులు వీటన్నింటితోపాటు అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. తన క్రికెట్ కెరీర్ ను ఒకసారి చూస్తే సచిన్ రికార్డులకి అతి దగ్గరగా తనే ఉన్నాడు.

ముఖ్యంగా సచిన్ సాధించిన వంద సెంచరీలకు ఇంకా 20 బాకీ ఉన్నాడు. ఇప్పటికీ టెస్టులు (29), వన్డేలు (50), టీ 20 (1) అన్నీ కలిపి మొత్తం 80 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్ కొహ్లీ వయసు 35 సంవత్సరాలు. మహా అయితే మరో మూడు, నాలుగేళ్లకు మించి ఆడే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు.

Also Read: ఒలింపిక్స్ చాంపియన్లను అవమానించిన ప్రధాని.. మండిపడిన హాకీ లెజెండ్స్!

ఇప్పటికే టీ 20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
బహుశా వచ్చే వన్డే వరల్డ్ కప్ 2027 లో ఆడే చివరి మ్యాచ్ రోజున రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని అనుకుంటున్నారు. ఆ తర్వాత మహా ఆడితే మరో ఏడాది టెస్ట్ మ్యాచ్ లు ఆడి, అక్కడ రిటైర్మెంట్ ఇస్తాడని చెబుతున్నారు. మరి ఈ మూడు-నాలుగేళ్లలో మరో 20 సెంచరీలు ఈజీగా చేస్తాడని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ఏడాదికి 5 సెంచరీల చొప్పున టార్గెట్ పెట్టుకుంటే పనైపోతుందని అంటున్నారు.

సచిన్ రిటైర్మెంట్ అయిన రోజున కూడా తన రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం విరాట్ కొహ్లీ ఒక్కడికే ఉందని అనడం విశేషం.
అయితే దురద్రష్టవశాత్తూ ఎన్నో సార్లు 90 దగ్గర అవుట్ అయిపోయాడు. అవి సెంచరీలుగా మలిచి ఉంటే ఇప్పుడంత టెన్షన్ ఉండేదికాదని అంటున్నారు.

ఇకపోతే  ఇప్పటివరకు 113 టెస్టులు ఆడాడు. అందులో 191 ఇన్నింగ్స్ లో ఆడి 8,848 పరుగులు చేశాడు. వీటిలో 254 అత్యధిక  స్కోరుగా ఉంది. ఇకపోతే 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి.

వన్డే కెరీర్ లో చూస్తే 295 మ్యాచ్ లు ఆడాడు. 13,906 పరుగులు చేశాడు. 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలున్నాయి. 183 హయ్యస్ట్ స్కోరుగా ఉంది.

ఇక టీ 20ల విషయానికి వస్తే 125 ఆడి, 4188 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 38 హాఫ్ సెంచరీలున్నాయి.

ఐపీఎల్ విషయానికి వస్తే 252 మ్యాచ్ లు ఆడి 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలున్నాయి.

ఇప్పటి వరకు 8 సార్లు టీ 20 ప్రపంచకప్ జరిగింది.. భారత్ నుంచి విరాట్ కోహ్లీ మాత్రమే రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. మరే భారత ఆటగాడికి కూడా ఈ పురస్కారం లభించలేదు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న ఏకైక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

Also Read: ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’.. కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై గంగూలీ

2008 ప్రారంభంలో కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో పాల్గొని భారతదేశ కీర్తిని ప్రపంచానికి విరాట్ చాటి చెప్పాడు. తను ఒంటి చేత్తో విజయాలను అందించి.. అలా జాతీయ జట్టులోకి వచ్చాడు. మళ్లీ నేటి వరకు వెనుతిరిగి చూడలేదు. టీ 20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో కొహ్లీ ఆడిన ఇన్నింగ్సే కీలకంగా మారి, ఇండియాకి కప్ తీసుకొచ్చింది.

ఆసియాకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ని ఇప్పటికి కూడా ఎవరూ మరిచిపోలేరు. అలా ఎన్నో చిరస్మరణీయమైన మ్యాచ్ లున్నాయి. ఇకపోతే ఎటాకింగ్ ప్లేలో కొహ్లీని మించిన మొనగాడు లేడనే పేరుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఒకటి కాదు, రెండు కాదు కొన్ని వందల రికార్డులు తన పేరున ఉన్నాయి. నిజానికి తను ఒక క్లాసిక్ బ్యాట్స్ మేన్ గా పేరు తెచ్చుకున్నాడు. నేటి తరం కుర్రాళ్లలా రొడ్డ కొట్టుడు ఉండదు.   ఎంతో కళాత్మకమైన ఇన్నింగ్స్ ఆడతాడు.

ప్రతి క్రీడాకారుడి జీవితంలో ఒడిదుడుకులు కామన్ గానే ఉంటాయి. కెప్టెన్ గా విఫలమైనా ఆటగాడిగానే సఫలమయ్యాడు. ఇక ఢిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, క్రికెట్ ని ప్రేమిస్తూ పెరిగిన విరాట్ కొహ్లీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఫిట్ నెస్ ను కాపాడుకునే విధానంలో తనని మించినవారు లేరు. భారతీయ క్రికెట్ కి దొరికిన ఒక ఆణిముత్యం…విరాట్ కొహ్లీ అని అందరూ సగర్వంగా చెప్పుకుంటారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×