EPAPER

Vinesh Phogat: ఎవరి బరువు వారే చూసుకోవాలి: కాస్ వివరణ

Vinesh Phogat: ఎవరి బరువు వారే చూసుకోవాలి: కాస్ వివరణ

Vinesh Phogat silver medal news(Sports news headlines): ఒలింపిక్స్ లో చేతికంది వచ్చిన పతకం.. మెడలోకి రాలేని దురదృష్టవంతురాలు ఎవరంటే భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్. తనకి జరిగిన అన్యాయంపై కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) ను ఆశ్రయించింది. అయితే కాస్ ఎందుకలా తీర్పు చెప్పాల్సి వచ్చిందో, తన అప్పీల్ ను తిరస్కరించాల్సి వచ్చిందో వివరించింది.


ముందుగా భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఒలింపిక్స్ లో జూనియర్ కాదు. తను సీనియర్ రెజ్లర్. చాలా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. అందువల్ల నిబంధనలన్నీ తనకి క్షుణ్ణంగా తెలుసు. అలాగే తన కోచ్ కూడా సీనియర్. ఆయనకి రూల్స్ తెలుసు. సెమీస్ బౌట్ అయ్యింతర్వాత వెయిట్ చూసుకున్న వినేశ్ ఫోగట్ ఫైనల్ పోరుకి ముందు బరువు తగ్గలేక అవస్థలు పడింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?

ఫైనల్ మ్యాచ్ కి ఒకరోజే సమయం ఉందని తెలిసి, 2.7 కేజీలు పెరిగేలా ఎందుకంత ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆహారం తినవద్దని మేం చెప్పం. తన శరీర తత్వం 53 కేజీలకు ఫిట్ గా ఉన్నప్పుడు 50 కేజీల విభాగంలోకి ఎందుకు వచ్చింది? సరే వచ్చింది, అన్నిరోజులు కరెక్టుగా మెయింటైన్ చేసి, చివరి మ్యాచ్ కి ఒక్కరోజు నియమం ప్రకారం ఆహారం తీసుకుని ఉంటే సరిపోయేది.


ఒలింపిక్స్ లోని అన్ని ఆటల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు కూడా వెయిట్ గురించి ఆలోచించాల్సిందే. వారు తినే ఆహారం విషయంలో అందరూ నియమాలు పాటిస్తారు. అది కష్టమే. కానీ తప్పదు. ఈ ఒలింపిక్స్ జరిగే 15 రోజులు ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ఇష్టం. ఈ  విషయంలో 100 గ్రాముల ఎక్కువ కావడం నిజంగా బాధాకరమే. కానీ నిబంధనల ప్రకారం తనని అనర్హురాలిగానే ప్రకటిస్తున్నాం.

Also Read: కళ్లు తిరిగి పడిపోయిన వినేశ్ ఫోగట్

చివరిగా సూచన ఏమిటంటే ఏ రెజ్లర్ అయినా సరే, తన బరువు తనే చూసుకోవాలి. అది వారి బాధ్యత అని తెలిపింది. ఈ విషయంలో  ఎవరికీ మినహాయింపు ఉండదు. కనీసం గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా అనుమతించడం కుదరదు. ఇందుకు పూర్తి బాధ్యత రెజ్లర్‌దేనని తేల్చి చెప్పింది.

తొలి బౌట్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌  సుసాకిపై సంచలన విజయం సాధించిన వినేశ్‌ ఆ తర్వాత క్వార్టర్స్‌, సెమీస్‌లోనూ గెలుపొంది ఫైనల్‌కు చేరింది. ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కింది. అయితే సెమీస్‌ పూర్తయ్యాక వినేశ్‌ 50 కిలోలకు మించి ఉండటంతో అనర్హురాలిగా బయటకు వచ్చింది.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×