EPAPER

Carolina Marin in tears: ఏడుస్తూ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న మారిన్

Carolina Marin in tears: ఏడుస్తూ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న మారిన్

Carolina Marin in tears: పారిస్ ఒలింపిక్స్‌లో ఊహించని పరిణామం. టైటిల్ ఫేపరేట్‌గా బరిలోకి దిగిన కరోలినా మారిన్.. అర్ధాంతరంగా బ్యాడ్మింటన్ నుంచి వైదొలిగింది. అంతేకాదు కంటతడి పెడుతూ టోర్నీ నుంచి వైదొలిగింది. అసలేం జరిగిందంటే..


స్పెయిన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కరలినా మారిన్ పారిస్ ఒలింపిక్స్ కంటతడితో వైదొలిగింది. ఈసారి ఎలాగై నా బంగారు పతకం దక్కించుకోవాలని బరిలోకి దిగిన ఆమె ప్రస్థానం అర్థాంతరంగా ముగిసింది. సెమీస్ వరకు చేరుకున్న మారిన్, ఆదివారం మహిళల సింగిల్స్ విభాగం సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్ హి బింగ్జియావో తలపడింది.

తొలిసెట్ గెలుచుకున్న మారిన్, రెండో సె‌ట్ లీడ్‌లోకి వచ్చింది. అయితే 10-8 తేడాతో స్కోర్ ఉన్నప్పుడు ఒక్కసారిగా మోకాలికి గాయమైంది. దాని నుంచి తేరుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. కాసేపు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు నొప్పి.. మరోవైపు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి బాధ ఈ రెండింటినీ ఆపులేకపోయింది. చివరకు కంటతడి పెడుతూ టోర్నీ నుంచి వైదొలిగింది.


ALSO READ: పారిస్ ఒలింపిక్స్, జకోవిచ్ బంగారం.. ఆపై కంటతడి..

కాంస్య పతకం పోరులోనూ మారిన్ బరిలోకి దిగే అవకాశం లేకపోయింది. మరో సెమీస్ ఓడిన గ్రెగోరియాకు కాంస్య పతకం లభించింది. ఫైనల్‌లో కొరియాకు చెందిన సియాంగ్‌తో బింగ్జియావో తలపడనుంది. 31 ఏళ్ల కరోలినా మారిన్‌కు ఎన్నో టోర్నీలు గెలుచుకుంది. 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో పీవీ సింధుతో తల పడింది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న మారిన్, మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిళ్లు సాధించింది కూడా.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×