EPAPER

Jasprit Bumrah : అత్యంత వేగంగా 150 వికెట్లు .. తొలి భారత బౌలర్‌గా బూమ్రా రికార్డు..

Jasprit Bumrah : అత్యంత వేగంగా 150 వికెట్లు .. తొలి భారత బౌలర్‌గా బూమ్రా రికార్డు..
Jasprit Bumrah

Jasprit Bumrah : టీమ్ ఇండియాలో డేంజరస్ వెపన్ ఎవరంటే స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా అనే చెప్పాలి. విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో రోజు ఆటను బుమ్రా శాసించాడు. 6 వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు రెండో ఆసియా ప్లేయర్‌గా రికార్డు సాధించాడు.  


ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ తీయడం ద్వారా 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 34 టెస్ట్‌ల్లోనే బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. కాకపోతే తనకన్నా ముందు 27 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ఈ ఘనత సాధించాడు. ఇక బుమ్రా తర్వాత ఇమ్రాన్ ఖాన్ 37, షోయబ్ అక్తర్ 37 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలు రాయి అందుకున్నారు.

భారత్ లో చూస్తే…150 వికెట్ల పడగొట్టేందుకు బుమ్రా మొత్తం 6781 బంతులు వేశాడు. బుమ్రా తర్వాత ఉమేశ్ యాదవ్ 7661 బంతులు తీసుకుంటే, మహమ్మద్ షమీ 7755, కపిల్ దేవ్ 8378, అశ్విన్ 8380 బంతులేసి ఈ ఘనత సాధించారు.


అంతేకాదు జస్ ప్రీత్ బుమ్రా టెస్ట్ ల్లో 6 వికెట్లు సాధించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఆస్ట్రేలియా (2018), వెస్టిండీస్ (2019), సౌతాఫ్రికా (  2023/24), తాజాగా ఇంగ్లాండ్ పై 6 వికెట్లు తీసి, తనకెవరు సాటిలేరని చాటి చెప్పాడు.

 బుమ్రా ప్రధానంగా ఇన్‌స్వింగర్, ఔట్‌స్వింగర్స్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని చెప్పిన పిచ్ పై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేశాడు. దీంతో  ఇంగ్లాండ్ బ్యాటర్లు అయోమయానికి గురయ్యారు.

మరోవైపు ఇదే పిచ్ పై మరో పేసర్ ముఖేష్ కుమార్ ఇబ్బంది పడి, పరుగులు సమర్పించుకున్నాడు. తొలి టెస్ట్ లో మహ్మద్ సిరాజ్ పరిస్థితి అలాగే ఉంది. మరి బుమ్రా ఎందుకు స్పెషల్ అంటే, అది భారత క్రికెట్ అదృష్టమని చెప్పాలి. 

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×