EPAPER

IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట..రాణించిన కోహ్లీ , సర్ఫరాజ్

IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట..రాణించిన కోహ్లీ , సర్ఫరాజ్

IND vs NZ: బెంగళూరు టెస్ట్ లో టీమిండియా పోరాటం కొనసాగిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకు ఆల్ అవుట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ ( Rohit Sharma ) అలాగే యశస్వి జైష్వాల్ ( Yashasvi Jaiswal ).. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ 52 పరుగులకు.. వికెట్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అలాగే సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) … చెరో 70 పరుగులు చేసి రాణించారు.


Bengaluru Test Kohli falls on the last ball of the day as hosts trail by 125 runs

ఈ తరుణంలోనే టీమిండియా ( Team India) మూడవరోజు ఆట ముగిసే సమయానికి… మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేయగలిగింది. అయితే మూడవరోజు చివరి బంతికి.. 70 పరుగులు చేసినారు విరాట్ కోహ్లీ.. క్యాచ్ అవుట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో… టామ్ కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే 231 పరుగులు చేసిన టీమ్ ఇండియా… న్యూజిలాండ్ కంటే ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !


ఇక నాలుగో రోజు అలాగే ఐదవ రోజు మిగిలి ఉంది. రేపటి రోజున టీమిండియా ( Team India)… వికెట్లు పడకుండా దాదాపు 500 పరుగుల వరకు చేస్తే… మంచి లీడ్ సంపాదించవచ్చు. ఆ తర్వాత న్యూజిలాండ్ కు బ్యాటింగ్ ఇచ్చి.. త్వరగా వికెట్లు తీయగలిగితే టీం మీడియా కచ్చితంగా విజయం సాధిస్తుంది. రేపు ప్రారంభమయ్యే మొదటి సెషన్.. రెండు జట్లకు చాలా కీలకం.

Also Read: Also Read: Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

రేపటి మొదటి సెషన్ లో టీమిండియా ( Team India) వికెట్లు రెండు పడిన… ఆ తర్వాత అందరూ అవుట్ అయిపోతారు. అప్పుడు మ్యాచ్ మొత్తం న్యూజిలాండ్ చేతుల్లోకి వెళ్తుంది. అలా కాకుండా టీం ఇండియా ప్లేయర్లు దీటుగా ఆడితే కచ్చితంగా గెలుస్తాం. ఇది ఇలా ఉండగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకు అలవుటైన సంగతి తెలిసిందే. అదే సమయంలో న్యూజిలాండ్ ( New Zealand) మొదటి ఇన్నింగ్స్ లో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

ఇది ఇలా ఉండగా… టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మధ్య మూడు టెస్టులు జరుగనున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్‌ బెంగళూరు వేదికగా రెండు రోజుల కిందట అంటే అక్టోబర్‌ 16వ తేదీన ప్రారంభం అయింది. ఇందులో మొదటి రోజు మ్యాచ్‌ వర్షార్ఫణం అయిన సంగతి తెలిసిందే. రెండో రోజు నుంచి మ్యాచ్‌ ప్రారంభం అయింది.

 

Related News

Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Big Stories

×