Ben Stokes Home: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు ( Ben Stokes ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెటర్ బెన్ స్టాక్స్ ( Ben Stokes ) ఇంట్లో… భారీ దొంగతనం జరిగింది. స్టోక్స్ ఇంట్లో ముసుగు దొంగలు ( masked gang ) పడ్డారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బెన్ స్టాక్స్ ( Ben Stokes ) పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇటీవల ఇంగ్లాండు జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో బెన్ స్టాక్స్ ( Ben Stokes ) కుటుంబ సభ్యులు మాత్రమే తన ఇంట్లో ఉన్నారు.
Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
అయితే ఇది గమనించిన దొంగలు.. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టాక్స్ ( Ben Stokes ) ఇంట్లో దొంగతనం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే అర్థరాత్రి ముసుగు వేసుకొని… దౌర్జన్యం చేసి మరి… దొంగతనం ( Robbery ) చేశారట. అయితే ఈ విషయాన్ని.. తాజాగా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టాక్స్ ( Ben Stokes ) స్వయంగా తెలపడం జరిగింది.
Also Read: Virat Kohli: కోహ్లీకి RCB బంపర్ ఆఫర్..తెరపై కెప్టెన్సీ ?
దొంగతనానికి వచ్చిన దొంగలు… తన ఇంట్లో విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని… కానీ తన కుటుంబానికి ఎలాంటి హాని జరగలేదని వివరించారు బెన్ స్టాక్స్ ( Ben Stokes ). కానీ తనకు ఎంతో ఇష్టం అలాగే సెంటిమెంట్ అయినా విలువైన వస్తువులను… దొంగలు ఎత్తుకుపోయారని బాధపడ్డారు బెన్ స్టాక్స్ ( Ben Stokes ). దీనిపై బెన్ స్టాక్స్ ( Ben Stokes ) మాట్లాడుతూ… అక్టోబర్ 17వ తేదీన అంటే 15 రోజుల కిందట.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వివరించారు.
Also Read: ICC Rankings: నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహీ, పంత్ ఔట్..!
ఇంగ్లాండ్ లోని ఈశాన్య ప్రాంతం కాజల్ ఈడెన్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో ముసుగు దొంగలు ( masked gang ).. దొంగతనం ( Robbery ) చేశారని వివరించాడు. ఖరీదైన నగలు అలాగే తనకు ఇష్టమైన వస్తువులు వాళ్ళు ఎత్తుకుపోయారని… ఆగ్రహించాడు. అయితే వాళ్ల.. పైన తనకు కోపం లేదని… తనకు సెంటిమెంటుగా ఉన్న వస్తువులను తిరిగి ఇచ్చేయాలని కోరాడు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.
దీనిపై వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కూడా బెన్ స్టాక్స్ ( Ben Stokes ) అభ్యర్థించాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారట. ఇది ఇలా ఉండగా… ఇటీవల పాకిస్తాన్ టూర్ కు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ గడ్డ పైన గెలుస్తామని.. విర్ర వీగిన షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో.. ఒకటి మాత్రమే గెలిచి సిరీస్ పోగొట్టుకుంది.