EPAPER

Rohit Sharma To Capitian In T20 World Cup: అందరి మనసులు గెలుచుకున్న రోహిత్ శర్మే కెప్టెన్.. జైషా ప్రశంసలు..! 

Rohit Sharma To Capitian In T20 World Cup: అందరి మనసులు గెలుచుకున్న రోహిత్ శర్మే కెప్టెన్.. జైషా ప్రశంసలు..! 

BCCI Secretary Jay Shah Confirms Rohit Sharma To Capitan India In T20 World Cup: ఎట్టకేలకు చిక్కు ముడి వీడింది. బీసీసీఐ కార్యదర్శి తన నోటితో తానే చెప్పాడు. రాబోయే టీ 20 వరల్డ్ కప్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడని కుండ బద్దలు కొట్టాడు. అందరి సందేహాలు పటాపంచలు చేశాడు. రాజ్ కోట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలవకపోయినా, రోహిత్ శర్మ అందరి మనసులు గెలుచుకున్నాడని అన్నాడు. రోహిత్ నాయకత్వంలో 2024 టీ 20 వరల్డ్ కప్ భారత్ గెలిచి తీరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


Read More: మూడో టెస్టు.. ఆ నలుగురు రికార్డులు బ్రేక్ చేస్తారా?

సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం పేరును బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా స్టేడియంగా మార్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జైషా మాట్లాడుతూ.. రోహిత్ శర్మపై బీసీసీఐకి ఉన్న నమ్మకాన్ని ప్రజలందరి ముందు చెప్పి, ముసుగులో గుద్దులాటను ఆపాడు.


నిజానికి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా పరాజయం తర్వాత రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకవైపు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు అత్యుత్సాహంతో రోహిత్‌ని తప్పించడం, మరోవైపు టీమ్ ఇండియాలో ఒకొక్క ఫార్మాట్‌కి ఒకొక్క కెప్టెన్ నియమించడంతో రోహిత్ శర్మ తీవ్ర మానసిక ఆందోళనలో కొట్టు మిట్టాడాడు. ఈలోపు నెట్టింట రోహిత్ ఫ్యాన్స్ ఫైటింగు, నానా రచ్చ అయ్యింది.

చిట్టచివరకు రోహిత్ శర్మ సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా వెళ్లాడు. అక్కడ నుంచి సూర్యకుమార్‌కి ఆపరేషన్ కావడంతో అనుకోకుండా ఆఫ్గనిస్తాన్ టీ 20కి కెప్టెన్‌గా వెళ్లాడు. అక్కడ సెంచరీ చేసి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు.

ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా, రోహిత్ కెప్టెన్సీ ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో రాజ్‌కోట్‌లో  జైషా మాట్లాడుతూ రోహిత్ కెప్టెన్సీపై అందరి అనుమానాలకు పబ్లిగ్గా తెరదించాడు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×