EPAPER

BCCI: బీసీసీఐకి.. కాసులు కురిపిస్తున్న ఐపీఎల్

BCCI: బీసీసీఐకి.. కాసులు కురిపిస్తున్న ఐపీఎల్

BCCI earned over 5000 crore from IPL 2023, 116 % increase from 2022 season: ప్రపంచ క్రికెట్ లో అత్యంత ఖరీదైన లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుపొందింది. అందుకనే ఐపీఎల్ లో ఆడేందుకు ప్రపంచ స్థాయి క్రికెటర్లు పోటీలు పడుతున్నారు. ఒకవైపు నుంచి ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు భారీ లాభాలు రావడమే కాదు, ఐపీఎల్ నిర్వహిస్తున్న బీసీసీఐకు కాసుల వర్షం కురుస్తోందని అంటున్నారు. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం బీసీసీఐకు ఒక్క ఐపీఎల్ ద్వారా సమకూరుతోంది. తద్వారా బీసీసీఐ ఆర్థికంగా బలోపేతం అవుతోంది.


అందుకే దులీఫ్ ట్రోఫీని సైతం కమర్షియల్ గా మార్చి, జాతీయ జట్టులో ఆటగాళ్లు అందరూ ఆడేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒక్క ఐపీఎల్ ద్వారానే కాదు.. ఇతర మార్గాల ద్వారా కూడా  ఆదాయాన్ని పెంచుకుంటూ పోతోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఇంతకీ ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఎంత లాభం చేకూరిందంటే?


2022 సీజన్‌తో పోలిస్తే 2023 ఎడిషన్‌ లో 116 శాతం పెరుగుదల కనిపించినట్లు తాజాగా వెలువడిన పలు నివేదికల్లో వెల్లడైంది.  2022 ఐపీఎల్‌లో ఆదాయం రూ.2,367 కోట్లు ఉండగా, 2023 వచ్చేసరికి, అది కాస్తా రూ.5,120 కోట్లకు చేరింది.  ఐపీఎల్ 2024కి వచ్చేసరికి ఐపీఎల్ నుంచి వచ్చిన ఆదాయం రూ.11,769 కోట్లు  అని తెలుస్తోంది.

Also Read: వినేశ్ కి ఎవరూ డబ్బులివ్వలేదు: భర్త సోమ్ వీర్

ఇకపోతే అటూ, ఇటు, ముందూ వెనుక ఖర్చులు పోనూ… చివరికి లాభం రూ.6,648 కోట్లకు చేరిందని అంటున్నారు. ఇంతకీ బీసీసీఐకి ఆదాయం ఎలా వస్తుందంటే… ముఖ్యంగా ఐపీఎల్‌ టెలికాస్టింగ్ రైట్స్, స్పాన్సర్‌షిప్స్‌ వల్ల వస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట.

ఇకపోతే 2023-27 సీజన్‌ కోసం మీడియా హక్కుల ద్వారానే బీసీసీఐకి నాలుగేళ్లకు కలిపి సుమారు రూ.48,390 కోట్లు వచ్చాయి. ఇందులో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు (స్టార్‌ స్పోర్ట్స్) ద్వారా రూ.23,575 కోట్లు, అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ (జియో సినిమా)తో రూ. 23,758 కోట్లు దక్కించుకుంది.

మరోవైపు ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ హక్కులను ప్రముఖ టాటా సన్స్ రూ. 2,500 కోట్లకు తీసుకుంది. ఇలా అన్నిరకాలుగా బీసీసీఐ కి ఐపీఎల్ ద్వారా లాభాలు రావడంతో భారత్ క్రికెట్ మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×