Big Stories

BCCI : ఆటగాళ్లకు BCCI డెడ్‌లైన్‌.. స్టోక్స్‌పై కన్నేసిన సన్‌రైజర్స్‌..

BCCI : డిసెంబర్‌ 23న కొచ్చిలో జరగబోయే IPL 2023 మినీ వేలంలో పాల్గొనాలనుకుంటున్న ఆటగాళ్లకు బీసీసీఐ డెడ్‌లైన్‌ విధించింది. వేలం బరిలో నిలవాలనుకుంటే… డిసెంబర్‌ 15లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని గడువు పెట్టింది. డిసెంబర్‌ 15 సాయంత్రం 5 గంటల్లోగా ఆటగాళ్లు తమ పేర్లను ఎన్‌రోల్‌ చేసుకోకపోతే… మినీ వేలానికి అనర్హులు అవుతారని హెచ్చరించింది.

- Advertisement -

మినీ వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌, ట్రేడింగ్‌ ప్రక్రియ ఈ నెల 15న ముగిసింది. ఆయా ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను ఉంచుకుని, వద్దనుకున్న వారిని వేలానికి వదిలిపెట్టాయి. 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకుని… మొత్తం 250 మంది వేలంలో పాల్గొనే ఛాన్స్ ఉందని బీసీసీఐ భావిస్తోంది. T20 వరల్డ్‌కప్‌ హీరోలు బెన్‌ స్టోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ వేలంలో ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకోగా… తాజాగా ఇంగ్లండ్‌ టెస్ట్‌ ఆటగాడు జో రూట్‌ కూడా తన పేరును ఎన్‌రోల్‌ చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచిన సామ్‌ కరన్‌, ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌, జింబాబ్వే స్టార్ ఆటగాడు సికందర్‌ రాజా లాంటి ప్లేయర్లు కూడా ఐపీఎల్ బరిలో నిలిచే ఛాన్స్ ఉందంటున్నారు.

- Advertisement -

మరోవైపు… ఫ్రాంచైజీలన్నీ స్టార్ ఆటగాళ్లపై కన్నేశాయి. ఎంత మొత్తమైనా ఖర్చు పెట్టి వాళ్లని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఇటీవలి T20 వరల్డ్‌కప్‌ స్టార్లు సామ్‌ కరన్‌, బెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌, ఆదిల్‌ రషీద్‌, సికందర్‌ రాజా, కెమరూన్‌ గ్రీన్‌ కోసం అన్ని ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉందంటున్నారు. అయితే, అన్ని ఫ్రాంచైజీలతో పోలిస్తే ఎక్కువ డబ్బు ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌… ఎక్కువ మంది స్టార్‌ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ ఖాతాలో 42 కోట్లకు పైగా ఉంది. దాంతో… బెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌, కెమరూన్‌ గ్రీన్‌లను చేజిక్కించుకునేందుకు సన్‌రైజర్స్‌ ఎంతైనా ఖర్చు చేసే అవకాశం ఉంది. వీరిలో స్టోక్స్‌కు 10 నుంచి 12 కోట్లు… హేల్స్‌కు 3 నుంచి 4 కోట్లు… గ్రీన్‌కు 6 నుంచి 8 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కేన్‌ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్‌… స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకుని, అతనికే కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏయే ఫ్రాంచెజీలు భారీగా ఖర్చు చేసి స్టార్ ఆటగాళ్లను దక్కించుకోబోతున్నాయో తెలియాలంటే… డిసెంబర్ 23 దాకా… అంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News