EPAPER

Hardik Pandya Suspension: హార్దిక్ పాండ్యాకు దెబ్బ మీద దెబ్బ

Hardik Pandya Suspension: హార్దిక్ పాండ్యాకు దెబ్బ మీద దెబ్బ

Mumbai Indians Captain Hardik Pandya Faces Suspension: ఏమిటో హార్దిక్ పాండ్యా పరిస్థితి చూస్తుంటే, ఒకొక్కసారి జాలి వేస్తోంది. అయ్యో ఎలా ఉండేటోడు.. ఎలాగైపోయాడనిపిస్తోంది. ఒక చిన్న నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది. డబ్బులైతే వచ్చాయిగానీ, మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ చింతనతోనే ఆటపైన ధ్యాస పెట్టలేకపోయాడు. వ్యక్తిగతంగా కూడా కెరీర్ పై తొలిసారి బాగా ఆడలేదనే పేరు తెచ్చుకున్నాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే హార్దిక్ పాండ్యాకు మళ్లీ ఐపీఎల్ నిర్వాహక కమిటీ రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. అంతేకాదు ఒక మ్యాచ్ పై నిషేధం కూడా విధించింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్ కారణంగా హార్థిక్ పాండ్యాపై సస్పెన్షన్ వేట్ వేసింది బీసీసీఐ. అదేమిటి? ఐపీఎల్ లో ముంబై పాత్ర ముగిసిపోయింది కదా? ఇక ఒక మ్యాచ్ పై నిషేధం ఎలాగా? అనుకుంటున్నారా? అదేనండీ, హార్దిక్ పాండ్యా అడ్వాన్స్ బుకింగ్ చేసి పెట్టుకున్నాడు. అంటే వచ్చే ఏడాది 2025లో జరిగే ఐపీఎల్ టోర్నమెంటులో మొదటి మ్యాచ్ ఆడకూడదన్నమాట.

అలాగే జట్టులోని ఆటగాళ్లకు కూడా పెనాల్టీ విధించారు. ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా అందరికీ వడ్డించారు. ప్రతీ ఆటగాడికి రూ.12 లక్షల చొప్పున పెనాల్టీ విధించారు. లేదంటే మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. అంటే ఏది తక్కువ ఉంటే అది అమలు చేస్తారు. ఈ చిన్న వెసులు బాటు మాత్రం కల్పించారు.


ఇంతా చేసిన ముంబాయి గెలిచినవి 4 మ్యాచ్ లు.. కానీ పెనాల్టీలు మాత్రం మూడు కట్టింది. ఫస్ట్ కెప్టెన్ పాండ్యాకి రూ.12 లక్షలు, తర్వాత రూ.24 లక్షలు, ఇప్పుడు రూ.30 లక్షలు అంటే తనకి వచ్చినదానికంటే పోయిందే ఎక్కువగా ఉన్నట్టుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంక తనతో పాటు ఆటగాళ్ల చేత కూడా కట్టించడంపై అందరూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే ఇది కావాలనే జరిగిందనే అనుమానాలు నెట్టింట జనం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గ్రూపులు కట్టి తనకు సహకరించలేదనే అక్కసుతోనే హార్దిక్ పాండ్యా ఇలా ఆలస్యం చేసి జట్టుకి నష్టం కలిగించాడనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనివల్ల ప్రతి ఆటగాడికి నష్టం కలిగింది. అలా దెబ్బ కొట్టాడని కొందరు అంటున్నారు.

Also Read: Hardik Pandya Fined: ఈసారి డబల్.. రూ. 24 లక్షల ఫైన్.. పాండ్యా ఏంటిది?

ఎప్పుడో ఒకప్పుడైతే, పోనీలే అని ఫ్రాంచైజీ కడుతుంది కానీ, పదేపదే ఆలస్యం చేస్తే, మాకెందుకీ తలనొప్పి అని వదిలేసి పోతారని అంటున్నారు. అదే గెలిస్తే పర్వాలేదు. ఓడిపోవడమే కాదు, మళ్లీ పెనాల్టీ కట్టమంటే ఫ్రాంచైజీ ఓనర్లకి పుండు మీద కారం జల్లినట్టు ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఏదైనా పాండ్యాకి దెబ్బ మీద దెబ్బ అంటున్నారు.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×