EPAPER

India Vs England 3rd Test: ఇంగ్లాండ్‌తో చివరి 3 టెస్టులు.. భారత్ జట్టు ఇదే!

India Vs England 3rd Test: ఇంగ్లాండ్‌తో చివరి 3 టెస్టులు.. భారత్ జట్టు ఇదే!
Cricket news today telugu

India Vs England 3nd Test(Cricket news today telugu): ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి 3 టెస్టులకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. ఆకాశ్ దీప్ కు తొలిసారిగా జట్టులో చోటు దక్కింది.


విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కాని కోహ్లీ చివరి మూడు టెస్టులకు కూడా అందుబాటులో లేడు. గాయంతో జట్టుకు దూరమైన జడేజా కోలుకున్నాడు. దీంతో మళ్లీ జట్టులో జడ్డూకు స్థానం కల్పించారు. అలాగే కేఎల్ రాహుల్ కూడా గాయం నుంచి కోలుకున్నాడు. అతడిని తిరిగి ఎంపిక చేశారు. రాహుల్, జట్టూ తొలి టెస్టు తర్వాత జట్టుకు దూరమయ్యారు. మూడో టెస్టు జరిగి సమయానికి ఫిట్ నెస్ క్లియరెన్స్ వస్తే రాహుల్, జడేజా తుది జట్టులో ఉంటారు.

గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయలేదు. రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ ను తిరిగి ఎంపిక చేశారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తీసుకుంటారని వార్తలు వచ్చినా వారిని పరిగణనలోకి తీసుకోలేదు. పేసర్ ఆకాశ్ దీప్ సింగ్ కు తొలిసారిగా భారత్ జట్టులో ఛాన్స్ దక్కింది.


Read More: Australia Vs India Under-19: అండర్ 19.. రేపే ఆస్ట్రేలియా-ఇండియా ఫైనల్..

టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్), జస్ ప్రీత్ బుమ్రా ( వైఎస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్‌, శుభ్ మన్ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్ జురెల్‌ (వికెట్ కీపర్), కేఎస్‌ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్ టీమిండియా గెలిచింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఫిబ్రవరి 15 న రాజ్ కోట్ లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. అలాగే ఫిబ్రవరి 23 -27 మధ్య రాంచీలో నాలుగో టెస్టు జరుగుతుంది. మార్చి 7 -11 మధ్య ధర్మశాలలో ఐదో టెస్టు జరగనుంది.

Tags

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×