EPAPER

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. ఐవోఏకు రూ. 8.5 కోట్లు

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. ఐవోఏకు రూ. 8.5 కోట్లు

BCCI Announced Rs 8.5 cr Financial Assistance: పారిస్ ఒలింపిక్స్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. పారిస్ వేదికగా జరుగుతున్న ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇటు ప్రేక్షకులు కూడా ఇంకా ఎప్పుడు అన్న చందంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఈ ఒలింపిక్స్ కోసం రెడీ అయ్యింది. ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు 20 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలువురు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. బోర్డు తరఫున భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు రూ. 8.5 కోట్లను అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలియజేశారు. ‘2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. మేం ఐవోఏకు రూ. 8.5 కోట్లు అందిస్తున్నాం’ అంటూ సోషల్ మీడియాలో జై షా పోస్ట్ పెట్టారు.


Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×