EPAPER

Bangladesh vs New Zealand : కివీస్‌ హ్యాట్రిక్.. బంగ్లాపై ఘనవిజయం..

Bangladesh vs New Zealand : కివీస్‌ హ్యాట్రిక్.. బంగ్లాపై ఘనవిజయం..
Bangladesh vs New Zealand

Bangladesh vs New Zealand : 2023 వన్డే ప్రపంచ కప్ లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట  బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన కివీస్ 42.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. అయితే గెలుపు మాత్రం అంత అలవోకగా రాలేదు. వీళ్లు కూడా ఒకొక్క పరుగు అతికష్టమ్మీద తీస్తూ, మరోవైపు వికెట్లను కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడి ఒడ్డున పడ్డారు.


ప్రపంచకప్ చరిత్రలో తొలిబంతికే వికెట్ తీసిన ఘనత కివీస్ బౌలర్ బౌల్ట్ కి దక్కింది. తను వేసిన తొలి బంతికే
లిటన్ దాస్ అవుటయ్యాడు. అలా పరుగులేమీ చేయకుండానే బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత ఓపెనర్ తంజిద్ హాసన్, ఫస్ట్ డౌన్ హాసన్ మిరాజ్ ఇద్దరూ కలిసి బండి నడిపించారు. ఈ క్రమంలో 40 పరుగుల వద్ద తంజిద్ (16) వెనుతిరిగాడు.
తర్వాత స్కోరు 56 పరుగులకి చేరిందో లేదో మిహద్ హాసన్ (30) అవుట్ అయ్యాడు. అదే స్కోర్ మీద నజ్ముల్ హాసన్ శాంటో (7) అవుటయ్యాడు. అప్పటికి 56 పరుగులకి 4 వికెట్లు పడి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

అయినా సరే బంగ్లాదేశ్ పట్టు విడవలేదు. సీనియర్లు కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ ఇద్దరూ ఒకొక్క పరుగు తీసి, స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించారు. 152 పరుగుల వద్ద షకీబ్ (40) అవుటయ్యాడు. తర్వాత ముష్ఫికర్ (66) అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 175 పరుగులు. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడుతూ వెళ్లాయి. చివర్లో మహ్మదుల్లా 41 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 245 పరుగులు అంటే ఒక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.


తర్వాత బ్యాటింగ్ కి దిగిన కివీస్ తొలుత పిచ్ పై తడబడ్డారు. కుదురుకోడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇక్కడ కూడా 12 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (9) తొలి వికెట్ పడింది. బంగ్లాదేశ్ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ జట్టులోకి పునరాగమనం చేసిన కేన్ విలియమ్సన్ భారీగా డిఫెన్స్ ఆడాడు. ఒక దశలో 12 ఓవర్లకి కివీస్ 50 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలా తాపీగా ఒకొక్క పరుగు తీశారు. జట్టు స్కోరు 92 పరుగుల వద్ద డెవాన్ కాన్వవే (45) అవుటయ్యాడు.

సెకండ్ డౌన్ మిచెల్ రాకతో సీన్ మారిపోయింది. 67 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఈ సమయంలో  78 పరుగులు చేసిన కేన్ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. అతని ప్లేస్ లో వచ్చిన ఫిలిప్స్ టపటపా 16 పరుగులు చేసి విజయాన్ని లాంఛనం చేశాడు. దీంతో 42.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కివీస్ లక్ష్యాన్ని చేరుకుంది.

కివీస్‌ బౌలర్లలో లూకీ ఫెర్గుసన్‌ 3, మ్యాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌లు రెండేసి వికెట్లు.. మిచెల్‌ శాంట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌లో తలా ఓ వికెట్‌ తీశారు. బంగ్లాదేశ్ లో రెహ్మాన్, షకీబ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×