EPAPER
Kirrak Couples Episode 1

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Shakib Al Hasan Announces Retirement From Test Cricket: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2026 ఛాంపియన్ ట్రోఫీతో వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పినట్లు పేర్కొన్నాడు. అక్టోబర్ 21 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు మ్యాచుల్లో ఆడగలేకపోతే భారత్‌తో రెండో టెస్టే తన కెరీర్‌లో ఆఖరి టెస్టు కావచ్చు అని షకీబ్ పేర్కొన్నాడు. రెండో టెస్ట్‌కు ముందు విలేకర్లతో మాట్లాడుతూ.. చాలా కష్టంగా ఉంది. ఆటపై తాను ఎంత కష్టపడ్డానో అల్లాకే తెలుసు.


టీ20 ప్రపంచకప్‌లో ఆడిన మ్యాచే తన ఆఖరి మ్యాచ్ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను రిటైర్మెంట్ అవ్వడానికి ఇదే సరైన సమయం అని తెలిపాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నా అని అన్నాడు. ఇక బంగ్లాదేశ్‌లో మీర్పూర్ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని ఉందని బీసీసీఐకి తెలిపాడు. దీంతో వాళ్లు అంగీకరించారు. 37 ఏళ్ల షకీబ్ అల్ హాసన్.. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసి.. 70 టెస్టుల్లో 4600 పరుగులు చేసి, 242 వికెట్లు తీశాడు. 247 వన్డేలో 7570 పరుగులు సాదించాడు. షకీబ్ 129 టీ20 ప్రపంచకప్ లో 2551 పరుగులు చేసి, 149 వికెట్లు తీశాడు.

Also Read: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?


అసలేమైందంటే..
షకీబ్ బంగ్లాదేశ్‌‌‌లో మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానీ షేక్ హసీనాకు చెందిన అవామీ పార్టీ అధ్యక్షుడుగా గతేడాది ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇటీవల హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో ఓ హత్యకు సంబంధించి కొందమందితో పాటు షకీబ్ అల్ హాసన్‌పై కేసు నమోదైంది. అప్పటినుంచి అతను స్వదేశానికి తిరిగి వెళ్లలేదు. అయతే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడం సమస్య కాదు. కానీ వెళ్లాకా అక్కడినుంచి రావడమే కష్టం అని తెలిపాడు. తన భద్రతపై స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని షకీబ్ పేర్కొన్నాడు. బంగ్లాతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లాక.. ఇక తన సొంతగడ్డకు తిరిగిరానని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి షకీబ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Related News

Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​

Shikhar Dhawan: శిఖర్ ధవన్ కు వాళ్ల టార్చర్..అందుకే రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్!

IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం..ఇక ‘ఢిల్లీ’ నుంచి బరిలోకి !

Pakisthan: మా బౌలర్లు పందుల్లా తింటారు.. ఒళ్లంతా అందరికీ బలుపే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

×