EPAPER

Babar Azam: 6 జంతువుల మాంసం తింటున్న బాబర్?

Babar Azam: 6 జంతువుల మాంసం తింటున్న బాబర్?

 


Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో.. పాకిస్తాన్ క్రికెట్ అలాగే బాబర్ అజాం (Babar Azam) గురించి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా బాబర్ అజాం దారుణంగా విఫలమౌతూ వస్తున్నాడు. దీంతో ఇటీవల ఆయన కెప్టెన్స్ కి కూడా రాజీనామా చేయడం జరిగింది. కెప్టెన్సీ కి రాజీనామా చేసిన అనంతరం కూడా పెద్దగా బాబర్లో మార్పు కనిపించడం లేదు.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. ఆయన తినే డైట్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చర్చనీయాంశం అయింది. బాబర్ అజాం తన కెరీర్ మొత్తం.. ఎక్కువ శాతం మాంసంపైన దృష్టి పెడుతున్నారట. ముఖ్యంగా పాకిస్తాన్ అంటేనే మాంసం బాగా తింటారని పేరు ఉంది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం… కూడా ఆరు రకాల మాంసాహారాలను ఇప్పుడు తింటున్నాడట.


తన డైట్ లో కచ్చితంగా ఈ ఆరు మాంసాహారాలు ఉంటేనే… ఆహారం తీసుకుంటాడట బాబర్. అందులో కోడి మాంసం, గొర్రె, చేపలు, బీఫ్ విపరీతంగా తినడానికి ఇష్టపడతాడట బాబర్. అలాగే పాకిస్తాన్ లో దొరికే కొన్ని పక్షుల మాంసాన్ని కూడా తినేందుకు బాగా ఆసక్తి చూపిస్తాడట. కొన్ని సమయాలలో… మేక మాంసం తినేందుకు కూడా… ఇష్టపడతాడట పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ (Babar Azam) .

Also Read: IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

అయితే సాధారణంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాన్ తో పాటు… ఇతర క్రికెటర్లు కూడా అదే ఫాలో అవుతారట. కొంతమంది బీఫ్ ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తారని చెబుతున్నారు. ఇదంతా పక్కకు పెడితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాబర్కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… టెస్ట్ సిరీస్ (Test Series) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది పాకిస్తాన్. ఇందులో కూడా బాబర్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు.

పాకిస్తాన్ గడ్డపైన ఇంగ్లాండ్ తో (england) మరో రెండు టెస్టులు ఆడనుంది. ఇలాంటి నేపథ్యంలో మరో రెండు టెస్టులకు గాను బాబర్ అజాన్ ను తొలగించారు. బాబర్ అజామ్ ను జట్టు నుంచి తొలగించడమే కాకుండా… తదుపరి మ్యాచ్లకు కూడా ఆయనను సెలెక్ట్ చేసేది కూడా నమ్మకం లేదని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా… బాబర్ (Babar Azam) విఫలమవుతున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఉందని కొంతమంది చెబుతున్నారు. గడిచిన 17 టెస్ట్ ఇన్నింగ్స్ లో… బాబర్ ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 30 పరుగులు మాత్రమే అతని హైయెస్ట్. బ్యాటింగ్ పిచ్ పైన కూడా బాబర్ బ్యాటింగ్ చేయలేకపోవడం… పాకిస్తాన్ను కలచివేస్తోంది. అందుకే అతనిపై వేటు వేసినట్లు సమాచారం.

Related News

IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

T20 World Cup 2024: టీమిండియా దారుణ ఓటమి.. WC నుంచి ఔట్?

Ind vs Ban T20i : భారత్ క్లీన్ స్వీప్… మూడో టీ20లోనూ ఘన విజయం, సిరీస్ కైవసం

India vs Bangladesh : సంజు ఫాస్టెస్ట్ సెంచురీ.. ఆ ఒక్క ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు, బంగ్లా బెంబేలు!

Ind vs Ban T20: ఉప్పల్‌‌లో టీమ్ ఇండియా ఉతుకుడు.. బంగ్లాకు భారీ టార్గెట్, ఆ వరల్డ్ రికార్డు జస్ట్ మిస్!

Ind Vs Nz: న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ గా అతడికి చాన్స్!

Big Stories

×