EPAPER

DPL 2024: 19 సిక్సర్లు, 8 ఫోర్లు.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన ఆయుష్

DPL 2024: 19 సిక్సర్లు, 8 ఫోర్లు.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన ఆయుష్

టీ 20 క్రికెట్ లో అసలేం జరుగుతోంది?
50 ఓవర్ల వన్డేల్లో కూడా సాధించలేని స్కోర్లను
20 ఓవర్లలో అలవోకగా చేసి పారేస్తున్నారు.
టెస్టు మ్యాచ్ ల్లో కూడా తొలిరోజు అంతా కలిసి ఆడిన స్కోరుని
టీ 20లో కొట్టి చూపిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందని అంటారా? ఒక అద్భుతం జరిగింది.


Ayush Badoni breaks record for most sixes in a T20 knock: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వర్సెస్ నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ ఆటగాడు ఆయుష్ బదోని పరుగుల సునామీ స్రష్టించాడు. 55 బంతుల్లో 165 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టాడు. ఇందులో 19 సిక్స్ లు, 8 ఫోర్లు ఉన్నాయి. విశేషం ఏమిటంటే క్రిస్ గేల్, భారత్ ఆటగాడు సాహిల్ చౌహాన్ ఇద్దరూ కొట్టిన 18 సిక్స్ ల రికార్డ్ ను ఆయుష్ బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్ లో మరో సెన్సేషన్ ఏమిటంటే…ఆయుష్ తో బరిలో దిగిన ప్రియాంష్ ఆర్య కూడా ఇరగదీశాడు. తను 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు. 40 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 10 సిక్స్ లు, 10 ఫోర్లు ఉన్నాయి.  అత‌ని సూప‌ర్ బ్యాటింగ్ ధాటికి.. బౌలర్ మనన్ భరద్వాజ్ దొరికిపోయాడు. తను వేసిన ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది ఆర్య చ‌రిత్ర సృష్టించాడు.


వీరిద్దరూ కలిసి సెంచరీల మోత మోగించడమే కాదు..103 బంతుల్లో 286 పరుగులు చేశారు. మొత్తానికి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అయితే  అత్యధిక స్కోరుకి 6 పరుగుల దూరంలో ఆగిపోయారు. 2023లో జరిగిన ఆసియా టీ 20 కప్ లో మంగోలియాపై నేపాల్ 314/3 చేసి ఇంతవరకు నెంబర్ వన్ గా ఉంది.

Also Read: హార్దిక్ పై కన్నేసిన నలుగురు భామలు

2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ తరఫున ఆడిన క్రిస్ గేల్ 69 బంతుల్లో 146 పరుగులు చేశాడు. ఇందులో 18 సిక్సర్లు ఉన్నాయి. ఇకపోతే రికార్డు భాగస్వామ్యం ఏదంటే… ఈస్ట్ ఆసియా కప్ లో భాగంగా చైనా వర్సెస్ జపాన్‌ మధ్య మ్యాచ్ జరిగింది.

ఇందులో జపాన్ బ్యాటర్లు లాచ్లాన్ యమమోటో, కెండెల్ కడోవాకి… 258 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంతవరకు ఇదే అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు భారత కుర్రాళ్లు ఈ రికార్డుని అధిగమించారు. అయితే బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించ లేదు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×