EPAPER

Australia : కంగారులతో కంగారే.. ది ఛాంపియన్స్..

Australia : కంగారులతో కంగారే.. ది ఛాంపియన్స్..

Australia : ప్రపంచ క్రికెట్ ప్రారంభ దశ నుంచి నేటి వరకు నిలకడగా రాణిస్తున్న టీమ్ ఆస్ట్రేలియా. టెస్టు, వన్డే, టీ20 .. ఇలా 3 ఫార్మాట్స్ లోనూ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఏకైక జట్టు. వన్డే ప్రపంచ కప్ లో ఆ జట్టుదే ఆధిపత్యం. ప్రతి టోర్నిలోనూ ఆసీస్ హాట్ ఫెవరేటే. ఇప్పటి వరకు 12 మెగా టోర్నిలు జరిగాయి. 7 సార్లు ఫైనల్ చేరిన ఆసీస్.. ఐదుసార్లు విజేతగా నిలిచింది.


వరుసగా నాలుగు సార్లు ఫైనల్ కు చేరిన రికార్డు ఆ జట్టుదే. ఆస్ట్రేలియా తర్వాత ఇంగ్లండ్ నాలుగుసార్లు, వెస్టిండీస్, భారత్ , శ్రీలంక మూడేసిసార్లు, పాకిస్థాన్ , న్యూజిలాండ్ రెండేసిసార్లు ఫైనల్ కు చేరాయి. భారత్ , విండీస్ జట్లు మాత్రమే రెండుసార్లు ప్రపంచ కప్ టైటిల్ సాధించాయి. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ ఒక్కొక్కసారి ఛాంపియన్ గా నిలిచాయి.

1975లో తొలి ప్రపంచ కప్ ఫైనల్ లో విండీస్ చేతిలో ఓటమి చవిచూసింది ఆసీస్. 1987లో ఇంగ్లండ్ ను ఓడించి ఆసీస్ తొలి వరల్డ్ కప్ ట్రోఫిని సాధించింది. 1996లో ఫైనల్ లో శ్రీలంక ముందు ఆసీస్ తలవంచింది. ప్రపంచ్ కప్ టైటిల్స్ వరుసగా మూడుసార్లు గెలిచిన జట్టు ఆసీస్సే. 1999, 2003, 2007 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ సాధించింది. ఈ మూడు మెగా టోర్ని ఫైనల్స్ లో భారత్ ఉపఖండం జట్లే తుదిపోరులో ఓడిపోయాయి. 1999లో పాకిస్థాన్, 2003 టీమిండియా, 2007లో శ్రీలంక ఫైనల్ లో ఆసీస్ చేతిలో పరాజయం పాలయ్యాయి. 2015లో ఆస్ట్రేలియా ఐదో టైటిల్ కైవసం చేసుకుంది.


వన్డే మెగా టోర్నిల్లో ఆస్ట్రేలియాలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ఆఖరి బంతి వరకు పోరాడటం ఆ జట్టు నైజం. పట్టుదలకు మారుపేరు ఆసీస్. పడినా పుంజుకోవడం .. అనూహ్యంగా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఆ జట్టుకే సొంతం. 1999 ప్రపంచ కప్ ఇందుకు బెస్ట్ యాగ్జాంపుల్. ఆ మెగా టోర్నిలో తొలి రెండు మ్యాచ్ లోనూ ఆసీస్ ఓడినా అనూహ్యంగా పుంజుకుంది. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ లు గెలిచి సూపర్ సిక్సుకు చేరుకుంది. సూపర్ సిక్సులో హ్యాట్రిక్ విన్స్ తో సెమీస్ చేరుకుంది. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన సెమీస్ టైగా ముగిసింది. అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్ గెలవడంతో ఆ జట్టే ఫైనల్ కు చేరుకుని టైటిల్ సాధించింది.

ఆసీస్ జట్టుకు 1987లో తొలి ప్రపంచ కప్ ను కెప్టెన్ అలెన్ బోర్డర్ అందించాడు. 1999లో స్టివ్ వా సారధ్యంలో రెండోసారి ప్రపంచ్ ఛాంపియన్ గా నిలిచింది. 2003, 2007 వరల్డ్ కప్ లను రికీ పాంటింగ్ కెప్టెన్సీలో సాధించింది. 2015 లో మైకేల్ క్లార్క్ ఆసీస్ కు ఐదో టైటిల్ అందించాడు.

ప్రపంచ కప్ టోర్నిల్లో నిలకడగా ప్రదర్శన చేసిన ఏకైక జట్టు ఆస్ట్రేలియానే. ఆ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు ఎంతో పటిష్టంగా ఉంటాయి. ఆల్ రౌండర్లు అదనపు బలం. మైదానంలో పాదరసంలా ఫీల్డర్లు కదులుతారు. వ్యూహాలను మైదానంలో పక్కాగా అమలు చేయడమే ఆసీస్ విజయసూత్రం. అందుకే ఆసీస్ 5 వన్డే ప్రపంచ్ కప్ టైటిల్స్ సాధించింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×