EPAPER

Mitchell Marsh : ఓరి ఈడి యాసాలో..! మొన్న కాలు, నేడు నోరు జారిన మార్ష్

Mitchell Marsh : ఓరి ఈడి యాసాలో..! మొన్న కాలు, నేడు నోరు జారిన మార్ష్

Mitchell Marsh : ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్..మొన్న వరల్డ్ కప్ ట్రోఫీపై  కాలు పెట్టి, పరువు పోగొట్టుకున్న తను ఇప్పుడేకంగా నోరే జారాడు. నేను అలా కాళ్లు పెట్టినందుకు ఏమీ ఫీల్ అవడం లేదు. మాకు లేని నొప్పి మీకెందుకు? సోషల్ మీడియాలో ట్రోలింగులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఘాటుగా స్పందించాడు.


మరొక్కసారి ఆ పని చేయాల్సి వస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు .. మార్ష్ స్పందిస్తూ..‘చేస్తాను .. అందులో తప్పేం ఉంది’ అని అన్నాడు. దీంతో నెట్టింట మళ్లీ విమర్శలు మిన్నంటాయి. పనిలో పనిగా ఇప్పుడు ఐసీసీని, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుని కూడా తిట్టిపోస్తున్నారు. డబ్బుల కోసం ఆడిస్తున్నారా? క్రికెట్ పై ప్రేమతో ఆడిస్తున్నారా? అని మండిపడుతున్నారు.

మార్ష్ ని వెంటనే జట్టులోంచి తొలగించి, కొరడా ఝులిపించాలని అన్నారు. లేకపోతే కొత్త తరం వచ్చి, వారింకా రూడ్ గా ప్రవర్తిస్తారు. అప్పుడు క్రికెట్ కే విలువ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇది భవిష్యత్ క్రికెట్ కి మంచిది కాదని అంటున్నారు. ఇప్పటికే తల దిమ్మెక్కిపోయి ఉన్న మార్ష్ మళ్లీ అదే పొరపాటు చేయడం, కనీసం పశ్చాత్తాపం కూడా లేకపోవడంతో…ఓరి నీ బలుపు తగలెయ్యా! అని నెట్టింట తెలుగువాళ్లు తిట్టిపోస్తున్నారు.


అసలు నీకు క్రికెట్ పై ప్రేమ ఉందా? అసులు నువ్వు క్రికెట్ ఆటగాడివేనా? నువ్వు ఆడే ఆటనే అగౌరపరుస్తావా? ఒక గొప్ప విజయం సాధించిన జట్టులో ఉన్నందుకు సంతోషం ఏమైనా నీలో ఉందా? ఇంత బలుపా? ఇంత అహంకారమా? అని మండిపడుతున్నారు.

క్రికెట్ ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగం, దానినే దైవంగా భావించిన పాతతరం పోయిందని క్రికెట్ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి చాలామంది క్రికెటర్లు ఒక సెంచరీ చేసి ఆకాశం వైపు చూస్తారు. అది దైవం కోసమా, తల్లిదండ్రుల కోసమో తెలీదు. ఎందుకలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మార్ష్ ని బోర్డులు క్షమించినా, క్రికెట్ ప్రేమికులు మాత్రం ఎప్పటికీ క్షమించరని అన్నారు. తను క్రికెట్ ద్రోహిగానే చరిత్రలో నిలిచిపోతాడని నెట్టింట శాపనార్థాలు పెడుతున్నారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×