EPAPER

AUS Vs NAM : రికార్డ్ విజయం.. కానీ ఆస్ట్రేలియాకి రెండో స్థానం..

AUS Vs NAM : రికార్డ్ విజయం.. కానీ ఆస్ట్రేలియాకి రెండో స్థానం..

AUS Vs NAM T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా అతి తక్కువ ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో అందరూ ఏమనుకున్నారంటే రికార్డులు బద్దలయ్యాయని అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా కన్నా తాత ఒకటి ఉంది. అదే శ్రీలంక జట్టు. 2014 టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌‌పై 90 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.


ప్రస్తుతం ఆస్ట్రేలియా 86 బంతులు ఉండగా నమీబియాపై విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా అంత గొప్పగా ఆడినా రెండో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఇక తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా 2021లో బంగ్లాదేశ్ పై 82 బంతులు ఉండగా విజయం సాధించింది. 2021లో స్కాట్లాండ్ పై భారత్ 81 బంతులు ఉండగా విజయం సాధించింది. 2021లో నెదర్లాండ్స్ పై శ్రీలంక 77 బంతులు ఉండగా మ్యాచ్ గెలిచింది.

వీటితో పాటు ఆస్ట్రేలియా మరో ఘనత సాధించిది. టీ20 వరల్డ్ కప్‌లో పవర్‌ప్లేలో ప్రత్యర్థికన్నా అధికంగా పరుగులు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. మొదటి ఆరు ఓవర్లలో నమీబియా 17/3 స్కోరు చేసింది. అదే ఆసీస్ అయితే 74/1 మెరుపు స్కోరు సాధించింది. ప్రత్యర్థి కంటే 57 పరుగులు ఎక్కువగా చేసింది.


Also Read: నమీబియాకి చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 5.4 ఓవర్లలో విజయం

అంతకుముందు ఈ రికార్డు నమీబియా పేరిట ఉండేది. 2021 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా పవర్‌ప్లేలో ప్రత్యర్థి కంటే 55 పరుగులు అధికంగా సాధించింది. ఇప్పుడదే నమీబియాపై ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. వీటన్నింటికన్నా ఒక గొప్ప రికార్డు ఉంది. అదేమిటంటే పవర్ ప్లే ముగియక ముందే మ్యాచ్ ను ముగించేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకి ఎక్కింది.

నిజానికి అమెరికా, వెస్టిండీస్ పిచ్ లపై జరుగుతున్న టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో బ్యాటర్ల ఆధిపత్యం అస్సలు కనిపించలేదు. అంతా బౌలర్లకి స్వర్గధామంగా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఆస్ట్రేలియా బ్రేక్ చేసింది. 5.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: Jasprit Bumrah: ఒక రికార్డ్ కి దగ్గరలో బుమ్రా.. టీ 20 ప్రపంచకప్ లో సాధ్యమేనా?

బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేలా సాగే టీ 20 మ్యాచ్ లకు భిన్నంగా ఈ పొట్టి ప్రపంచకప్ పోటీలు జరుగుతుండటం విశేషం. ఐపీఎల్ మ్యాచ్ లు, పలు దేశాల్లో జరిగే లీగ్ మ్యాచ్ లు చూసి బహుశా బౌలింగ్ పిచ్ లు చేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Big Stories

×