EPAPER

David Warner : ఎక్కడా తగ్గేదేలే.. వన్డేలకు వార్నర్ గుడ్ బై..!

David Warner : ఎక్కడా తగ్గేదేలే.. వన్డేలకు వార్నర్ గుడ్ బై..!

David Warner : ఆస్ట్రేలియా క్రికెట్ లో ఎందరో గొప్ప గొప్ప క్రికెటర్లు ఉన్నారు. వారు జాతీయ జట్టులో తమ కంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వారిలో ఒకరు డేవిడ్ వార్నర్. టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. సడన్ గా వన్డేల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు తెలిపి, అభిమానులను షాక్ కు గురిచేశాడు.


నిజానికి ఆస్ట్రేలియన్లు తీసుకునే శిక్షణ చాలా కఠినమైనది. టీమ్ ఇండియాకి గ్రెగ్ ఛాపెల్ వచ్చిన తర్వాత ఆ విషయం అందరికీ, ముఖ్యంగా భారత క్రికెటర్లకి అర్థమైంది. మనవారి ఆట తీరు ఎలా ఉండేదంటే.. ఆరోజు భారత్ క్రికెట్ అదృష్టం మీద ఆధారపడి ఉండేది. క్లిక్ అయితే సెంచరీ, లేదంటే గ్యాలరీ అన్నరీతిలో భారత క్రికెటర్లు ఉండేవారు.

ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా గ్రెగ్ చాపెల్ శిష్యుడే. అలాంటి గురువుల దగ్గర రాటు దేలిన డేవిడ్ వార్నర్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని అనడం కన్నా తను సంపాదించుకున్నాడని చెప్పాలి.


ఎంతో మంది క్రికెటర్లు వస్తుంటారు. పోతుంటారు. కానీ జనం మధ్యలో గుర్తుండిపోయేది కొందరే. అలాంటి వారిలో డేవిడ్ వార్నర్ కూడా ఒకరనే చెప్పాలి. వార్నర్ ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతూ అభిమానులకు దగ్గరయ్యాడు. తను పుష్ప సినిమా చూసిన దగ్గర నుంచి ఆ స్టయిల్ అన్ని చోట్లా అప్లై చేస్తూ మరింత పాపులర్ అయ్యాడు. స్వతహాగా భోళా మనిషి కావడం, చిన్నాపెద్దా అందరితోనూ కలిసిపోవడం, చక్కగా నవ్వడం, నవ్వించడం తనకి మరింత మైలేజ్ తెచ్చింది. నిజానికి తన ఆటతీరుకన్నా వ్యక్తిత్వంతోనే ఎక్కువమందికి దగ్గరయ్యాడు.

అలాంటి డేవిడ్ వార్నర్ తన కెరీర్ లో సొంత గడ్డపై ఆఖరి టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. ఇప్పుడు రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా మూడో టెస్ట్ కు సిద్ధపడుతోంది. అయితే మొదటి టెస్ట్ లో సెంచరీ చేసి ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు.

ఇప్పుడు సడన్ గా తను వన్డేల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందరినీ షాక్ నకు గురి చేశాడు. అన్నీ కలిసొచ్చి 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్ అవసరమైతే మాత్రం తప్పక రీ ఎంట్రీ ఇస్తానని వార్నర్ అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ లో కొనసాగుతానని అన్నాడు. ప్రపంచకప్ ను గెలిచిన, గెలిపించిన టీమ్ లో ఉన్నప్పుడే తను రిటైర్మెంట్ ప్రకటించడం సరైన సమయమని భావిస్తున్నట్టు తెలిపాడు.

టెస్ట్, వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల ఫ్రాంచైజీల్లో ఆడేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని అన్నాడు. తన క్రికెట్ కెరీర్ తీర్చి దిద్దడంలో గ్రెగ్ చాపెల్ కీలక పాత్ర పోషించినట్టు తెలిపి, గురువుగారిని ఒకసారి తలచుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా కప్ సాధించడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. జట్టులో అందరికన్నా ఎక్కువగా 528 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.

మొత్తానికి టెస్ట్ ల్లో, ఇటు వన్డేల్లో తనదైన ముద్ర వేసి క్రికెట్ కి ఘనంగా వీడ్కోలు పలికిన అతి కొద్ది మంది క్రికెటర్లలో డేవిడ్ వార్నర్ ఒకడిగా నిలిచాడు.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×