EPAPER

AUS vs WI Day Night Test : షమర్ జోసెఫ్ నిప్పులు.. ఆస్ట్రేలియాకు చుక్కలు.. వెస్టిండీస్ సంచలన విజయం..

AUS vs WI Day Night Test :  షమర్ జోసెఫ్ నిప్పులు.. ఆస్ట్రేలియాకు చుక్కలు.. వెస్టిండీస్ సంచలన విజయం..
AUS vs WI Day Night Test

AUS vs WI Day Night Test : వన్డే వరల్డ్ కప్ కు క్వాలిఫై కాలేకపోయిన వెస్టిండీస్ పూర్వవైభవం అందుకునేందుకు తొలి అడుగు వేసింది. ఆస్ట్రేలియాను టెస్టు మ్యాచ్ లో వారి సొంత గడ్డపైనే ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. బిస్బ్రేన్ లో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా పోరాడిన విండీస్.. ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరాటంలో విజయభేరి మోగించింది. తొలి టెస్టులో ఓడినా పుంజుకుని రెండో టెస్టును కైవసం చేసుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


216 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 8 పరుగుల తేడాతో విండీస్ సంచలన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 311 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి డిక్లే ర్ చేసింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో స్టివ్ స్మిత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 91 పరుగులతో అజేయంగా నిలిచాడు.


విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 7 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మిచెల్ స్టార్ వేసిన యార్కర్ కాలి బొటన వేలికి తీవ్ర గాయమైనా బౌలింగ్ దిగాడు. నిప్పులు చెరిగే బంతులు విసిరి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. విండీస్‌కు ఆస్ట్రేలియా గడ్డపై 30 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని అందించాడు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×