EPAPER

Athletes of Indian: విశ్వమంతా.. మనోళ్లే! ఒలింపిక్స్ లో భారత సంతతి క్రీడాకారులు

Athletes of Indian: విశ్వమంతా.. మనోళ్లే! ఒలింపిక్స్ లో భారత సంతతి క్రీడాకారులు

Athletes of Indian origin at Paris Olympics : చాలాకాలం క్రితం తెలుగులో ఒక సినిమా వచ్చింది.
అందులో రావుగోపాల్రావు అందరికీ మాలిష్ చేస్తుంటాడు.
కస్టమర్ విజయనగరం వాడైతే అక్కడ గొప్పగొప్పవాళ్ల పేర్లన్నీ చెబుతుంటాడు. అలా ఒకతనికి మాలిష్ చేస్తూ..
మన ఇజయనగరం లాంటి ఊరు ఓల్ ఇండియాలోనే కాదు, ఇంగ్లండులో కూడా లేదని ఇంగ్లీషు పత్రికలో ఏశారంట బాబూ..
ఎలాంటి ఊరు బాబూ.. మన ఇజినగరం..
ఆల్ వరల్డ్ ఛాంపియన్ మల్లయోధుడు కోడిరామ్మూర్తిది మన ఇజినగరం బాబూ
ఘంటశాల వేంకటేశ్వరరావు గోరు పాటలు నేర్చుకున్నది మన ఇజినగరం బాబూ
మన పిడేలు వెంకటసామి నాయుడిది ఇజినగరం బాబూ
ఆళ్లది ఇజినగరమే.. మనదీ ఇజినగరమే..
ఇలా చెప్పుకుంటూ వెళ్లిపోతుంటాడు.


ఇదంతా ఎందుకంటే, అక్కడికే వస్తున్నాం.. ఇప్పుడు పారిస్ లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి కదండీ. అక్కడికి మన భారత్ నుంచే కాదండీ…వేరే వేరే దేశాల నుంచి కూడా మనోళ్లు వచ్చేస్తున్నారు. అంటే
చూట్టానికి కాదండీ.. ఆడటానికి.. అదేనండీ మన భారత సంతతికి చెందిన క్రీడాకారులు..
రేప్పొద్దున్న ఆళ్లు కూడా పతకం సాధిస్తే, మనం కూడా రావుగోపాల్రావులా చెప్పుకోవాలి కదండీ..
‘ఆ పతకం సాధించినమ్మాయిది ఏ దేశం బాబూ.. మన ఇండియా’.. అని మనం కూడా గట్టిగా అనాలి కదా…అందుకే వారెవరో ఓ లుక్కేసేద్దాం.

మొన్ననే టీ 20 ప్రపంచకప్ లో కూడా వివిధ దేశాలు పాల్గొన్నాయి. అందులో చాలావరకు మన భారత సంతతి క్రీడాకారులున్నారు. ముఖ్యంగా అమెరికా జట్టులో అయితే, సగం మంది మనవాళ్లే ఉండటం విశేషం. తాజాగా జరిగిన జింబాబ్వే పర్యటనలో కూడా ఆ జట్టు కెప్టెన్ ఎవరో కాదు.. మనవాడే పేరు సికందర్ రజా.. ఇప్పుడు ఒలింపిక్స్ లో కూడా భారత కిరణాలు అక్కడక్కడ మెరుస్తున్నాయి. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందాం పదండి.


Also Read: ఐపీఎల్ 2025, ఐపీఎల్‌లో ద్రావిడ్ రీఎంట్రీ, రాజస్థాన్ కోచ్‌గా..

అమెరికా టెన్నీస్ జట్టులో.. రాజీవ్ రామ్ (బెంగళూరు)
ఫ్రాన్స్ టేబుల్ టెన్నీస్ లో: ప్రీతిక (పుదుచ్చేరి)
అమెరికా టేబుల్ టెన్నీస్ లో: కనక్ ఝా (కోల్ కతా)
సింగపూర్ నుంచి అథ్లెటిక్స్ లో:  శాంతి పెరీరా (కేరళ)
కెనడా నుంచి రెజ్లర్ విభాగంలో: అమర్ దేశీ ( పంజాబ్)

ప్రస్తుతం వీరి కుటుంబాలు ఎప్పుడో ఆ దేశాల్లోకి వచ్చి స్థిరపడిపోయాయి. ఇప్పుడు కొన్న పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. త్వరలో ప్రారంభం కానున్న ఒలింపిక్ గేమ్స్ లో 206 దేశాలు పాల్గొంటున్నాయి. మరి వీరిలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు. పతకాలు గెలిస్తే మాత్రం తప్పక వెలుగులోకి వస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×