EPAPER

Ashwini Ponnappa: కోటిన్నర ఖర్చు చేశారా? శుద్ధ అబద్ధం: అశ్వినీ పొన్నప్ప సీరియస్

Ashwini Ponnappa: కోటిన్నర ఖర్చు చేశారా? శుద్ధ అబద్ధం: అశ్వినీ పొన్నప్ప సీరియస్

Ashwini Ponnappa: పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. ఇప్పుడిప్పుడే భారత్ లో మంట రగులుతోంది. ఎందుకంటే 117 మంది క్రీడాకారులు వెళితే.. కేవలం 6 పతకాలతో మాత్రమే మనవాళ్లు తిరిగొచ్చారు. గెలిచిన వాళ్ల సంతోషం పక్కన పెడితే, ఓడిన వారిలో ఆక్రోశం ఉబికి వస్తోంది. ఈ క్రమంలో పుండు మీద కారం జల్లినట్టు.. క్రీడాకారులపై ఇంతింత ఖర్చు చేశామనేసరికి.. బ్యాడ్మింటన్ స్టార్ అశ్వినీ పొన్నప్ప బరస్ట్ అయ్యింది. ఇంతకీ తనేమన్నాదంటే..


పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి తనకు వ్యక్తిగతంగా ఒక్కరూపాయి ఆర్థిక సహాయం కూడా అందలేదని కుండబద్దలు కొట్టింది. విషయం ఏమిటంటే.. ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులకు అందించిన ఆర్థిక సహాయం వివరాల్ని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) విడుదల చేసింది.

అందులో అశ్వినీకి టాప్ పథకం కింద రూ.4,50,000 ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతేకాదు వార్షిక శిక్షణ శిబిరాలు, టోర్నీల కోసం దాదాపు కోటీ యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు సాయ్ పేర్కొంది. ఇది చూసిన అశ్వినీ పొన్నప్పకు గుండె గుభేల్ మంది. వెంటనే స్టేట్మెంట్ ఇచ్చింది.


Also Read: ఒలింపిక్స్ రియల్ ఛాంపియన్ ఇతనే.. ఒకటీ రెండు కాదు.. ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్!

నాకు నేరుగా డబ్బులైతే అందలేదని తెలిపింది. ఈ విషయం చూసి షాక్ అయ్యాను. నాకు డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు. కానీ నాకు చెల్లించినట్టు యావద్భారత దేశానికి చెప్పడం బాధగా ఉంది. ఇప్పుడు వాళ్లందరూ ఏమనుకుంటారు? నేనంత ఖర్చు పెట్టించి కూడా పతకం తేలేదని భావిస్తారు. నన్ను తిట్టుకుంటారని తెలిపింది.

జాతీయ శిబిరం విషయానికి వస్తే.. క్రీడాకారులందరికీ కలిపి రూ.1.5 కోట్లు ఖర్చు చేశారు. మాకు ప్రత్యేకమైన కోచ్ కూడా లేడు. వ్యక్తిగత ట్రైనర్ కి నేనే డబ్బులు చెల్లిస్తున్నాను. ఎవరి నుంచి డబ్బులు తీసుకోవడం లేదు. 2023 వరకు నవంబరు వరకు సొంతంగానే ఆడాను. ఒలింపిక్స్ కి అర్హత సాధించిన తర్వాతే నన్ను టాప్ పథకంలో చేర్చారని తెలిపింది.

అయితే మద్దతు వరకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అద్భుతంగా అందింది కానీ.. డబ్బులైతే రాలేదు. రూ.1.5 కోట్లు ఇచ్చినట్టు చెప్పడం మాత్రం సరికాదని తెలిపింది. అశ్విని ప్రయాణ ఖర్చులు, వసతి, ఆహారం, టోర్నీల ఫీజు, డీఏ.. వీటన్నింటికి కలిపి రూ. 1.48 కోట్లు ఖర్చు చేసినట్టు సాయ్ వర్గాలు చెబుతున్నాయి. చివరికి అశ్విని ఏమందంటే నాలుగేళ్లుగా నాపై ఇంత డబ్బు ఖర్చు చేశారంటే మాత్రం ఓకే అని తెలిపింది.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×