EPAPER

Ashish Nehra: వాళ్లిద్దరూ అవసరమా?.. గంభీర్ పై నెహ్రా సీరియస్

Ashish Nehra: వాళ్లిద్దరూ అవసరమా?.. గంభీర్ పై నెహ్రా సీరియస్

Ashish Nehra is disappointed with Gautam Gambhir for not Trying out New Players: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై, అప్పుడే మాటల దాడి మొదలైంది. శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినప్పుడు ఎవరూ నోరు మెదపలేదు. కానీ సీనియర్లందరూ ఆడుతున్న వన్డే సిరీస్ పై అప్పుడు విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే తొలి వన్డే టై అయ్యింది. రెండో వన్డే ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు.


గంభీర్ చేస్తున్న ప్రయోగాలపై నేను మాట్లాడటం లేదు. అవి కరెక్టా? రాంగ్ ? అని చెప్పడం లేదు. తనేదో ఒక మంచి టీమ్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఎవరు బౌలింగు చేయగలరు? ఎవరు బ్యాటింగ్ మాత్రమే చేయగలరు? ఎవరు వన్డేలు ఆడగలరు? ఎవరు టీ 20 లు ఆడతారు? ఇంకా అదనంగా ఎవరిలో ఏ స్కిల్స్ ఉన్నాయి? వీటన్నింటినీ స్టడీ చేస్తున్నాడు. ఇందుకోసం కొన్ని నష్టాలు జరుగుతాయి.

చంద్రయాన్ 2 విఫలమైంది కదా.. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది.  అదే ఇప్పుడు శ్రీలంకతో కూడా ఎదురవుతోంది. వాటిని నేను ప్రశ్నించడం లేదు. రెండోది ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో లేడు. కొత్త కుర్రాళ్లు ఒకరిద్దరు తేలిపోతున్నారు. అక్కడేదో జరుగుతోంది. దానిని వదిలేయండి.


Also Read: శివమ్ దూబె, రాహుల్ పై వేటు? రేపే శ్రీలంకతో మూడో వన్డే

నా ఉద్దేశం ఏమిటంటే.. సీనియర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ శ్రీలంక టూర్ కి రానని అన్నారు. వారిద్దరినీ వదిలి కొత్తవారికి అవకాశం ఇచ్చి చూడాల్సిందని అన్నాడు. టీ 20 నుంచి సూర్యకుమార్, ఓపెనర్ యశస్వి, సంజూ శాంసన్, ఇంకా జట్టులోకి తీసుకోని రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ వీరందరూ ఉన్నారు కదా.. వారిని ఆడించాల్సిందని అన్నాడు. టెస్టుల్లో యశస్వి క్లిక్ అయ్యాడు, సంజూ ఆట వన్డేలకు సరిపోతుంది. రుతురాజ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడని అన్నాడు.

ఇకపోతే విరాట్, రోహిత్ శర్మ ఆట తెలియకపోవడానికి తనేమీ విదేశీ కోచ్ కాదు కదా అన్నాడు. కొత్త ఆటగాళ్లను ప్రయత్నించి చూడడానికి గంభీర్ కు ఇది మంచి అవకాశమని, దీనిని తను వృధా చేశాడని అన్నాడు. అయితే గంభీర్ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని తాను తప్పని అనడం లేదని నెహ్రా స్పష్టం చేశాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ఇదే మంచి తరుణం అని చెప్పడమే నా ఉద్దేశం” అని నెహ్రా వివరించాడు.

Related News

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Big Stories

×