EPAPER

IPL Mega Auction : మెగా వేలం వద్దు.. మినీ వేలం ముద్దు : షారూఖ్ మాటలతో రచ్చ.. మద్దతు తెలిపిన కావ్య

IPL Mega Auction : మెగా వేలం వద్దు.. మినీ వేలం ముద్దు : షారూఖ్ మాటలతో రచ్చ.. మద్దతు తెలిపిన కావ్య

IPL Mega Auction vs Mini Auction : మెగా వేలం ఎందుకు? మినీ వేలం చాలు అని కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూఖ్ అనడంతో రచ్చరచ్చ జరిగింది. ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణలో తీసుకోవాల్సిన అంశాలు, సూచనలపై ఫ్రాంచైజీలతో బీసీసీఐ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఫ్రాంచైజీలు మెగా వేలానికి మద్దతు పలికితే, షారూఖ్, కావ్యలాంటి వాళ్లు ఒప్పుకోలేదు.


ఇలాగైతే ఫ్రాంచైజీలు నిర్వహించడం కష్టమవుతుందని షారూఖ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న పంజాబ్ కింగ్స్ యజమాని నెస్ వాడియా విభేదించారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. సమావేశంలో జరిగిన అంశాలపై క్రిక్ బజ్ వెబ్ సైట్ కు ఈ విషయాలను తెలిపారు.

అయితే షారూఖ్ ఖాన్ చెప్పిన అంశంపై హైదరాబాద్ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ మద్దతు తెలిపారు. అంతేకాదు తన వంతు వచ్చినప్పుడు ఐపీఎల్-2025కి ముందు మెగా వేలానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు. సమావేశంలో చర్చకు వచ్చిన ప్రధానాంశాలు ఏమిటంటే.. ఆటగాళ్ల నిబంధనలు, సెంట్రల్ మర్చండైజింగ్, లైసెన్సింగ్‌, మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ ఇంకా ఇతర వ్యాపార అంశాలపై కూడా యజమానులు అభిప్రాయాలను అందించారు. ఇతర అంశాలను కూడా చర్చించారు.


Also Read : నేను కెప్టెన్ కాదు.. లీడర్ ని మాత్రమే: సూర్యకుమార్

అయితే వీరందరూ చేసిన సిఫార్సులను టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌కు పంపుతామని బీసీసీఐ తెలిపింది. అంతేకాదు వీటిని ఈ సిఫార్సులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. ఎందుకంటే ఫ్రాంచైజీలు వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. వారికి కొంత లాభాలు వచ్చేలా చూడాలని భావిస్తున్నట్టు తెలిసింది.

ఐపీఎల్ వల్ల ఒక్క డబ్బులే కాదు.. అందులో అంతర్లీనంగా క్రికెట్ ను వ్యాప్తి చేయడం కూడా ఒకటని చెబుతున్నారు. అందుకని సాధ్యమైనంతవరకు షారూఖ్, కావ్య మారన్ చెప్పిన మినీ వేలం అంశం తప్ప అన్నీ నెరవేర్చేలాగే ఉన్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×