EPAPER

Argentina Wins Copa America: కోపా అమెరికా కప్ విజేత అర్జెంటీనా.. 16 సార్లు టైటిల్ గెలిచిన రికార్డ్ సొంతం!

కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ చరిత్రలో లయోనెల్ మెస్సీకి చెందిన అర్జెంటీనా అతిపెద్ద రికార్డ్ సాధించింది. తాజాగా ఆదివారం రాత్రి (ఇండియా టైమింగ్ సోమవారం తెల్లారుజామున) అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కోపా అమెరికా 2024 ఫైనల్ మ్యాచ్‌లో కొలంబియాపై డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 1-0తో విజయం సాధించింది.

Argentina Wins Copa America: కోపా అమెరికా కప్ విజేత అర్జెంటీనా.. 16 సార్లు టైటిల్ గెలిచిన రికార్డ్ సొంతం!

Argentina Wins Copa America| కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ చరిత్రలో లయోనెల్ మెస్సీకి చెందిన అర్జెంటీనా అతిపెద్ద రికార్డ్ సాధించింది. తాజాగా ఆదివారం రాత్రి (ఇండియా టైమింగ్ సోమవారం తెల్లారుజామున) అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కోపా అమెరికా 2024 ఫైనల్ మ్యాచ్‌లో కొలంబియాపై డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 1-0తో విజయం సాధించింది.


ఇప్పటికే వరుసగా రెండుసార్లు కోపా అమెరికా టైటిల్ విన్నర్‌గా నిలిచిన అర్జెంజీనా టీమ్.. ఈసారి కూడా ఫైనల్ గెలవడంతో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. పైగా ఈ ఫైనల్ గెలవడంతో అర్జెంటీనా మొత్తం 16 సార్లు కోపా అమెరికా చాంపియన్‌గా భారీ రికార్డ్ నెలకొల్పింది. కతార్ 2022 ప్రపంచకప్ కూడా అర్జెంటీనా గెలిచింది. అర్జెంటీనా తరువాత 15 సార్లు కోపా అమెరికా కప్ గెలిచిన రికార్డ్ ఉరుగ్వే పేరున ఉంది.

Also Read: వింబుల్డన్ విజేతలకు ఎన్నికోట్ల ప్రైజ్ మని తెలుసా?.. ఐపిఎల్ కంటే ఎక్కువే..


తాజాగా ముగిసిన ఫైనల్‌లో కొలంబియా, అర్జెంటీనాల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగింది. రెండు టీమ్ లలో ఏ ఒక్కరు కూడా 90 నిమిషాల మ్యాచ్ టైమ్‌లో గోల్ చేయలేకపోయింది. ఎక్సట్రా టైమ్‌లో 112 నిమిషానికి లటారో మార్టినెజ్ అతికష్టంగా గోల్ చేయగలిగాడు. ఈ గోల్‌తోనే అర్జెంటీనా చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లయోనెల్ మెస్సీ గాయపడడంతో టీమ్ ఒకదశలో కష్టాల్లో పడింది. మ్యచ్ 38వ నిమిషంలో లయోనెల్ మస్సీ.. ప్రత్యర్థి టీమ్‌కు చెందిన అరియాస్‌తో ఢీకొనడంతో గాయం అయింది. అయినా మెస్సీ మ్యాచ్ 66వ నిమిషం వరకు ఆడడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి తీవ్ర నొప్పి ఉండడంతో సరిగా నడవలేక మ్యాచ్ సెకండ్ హాఫ్‌లో వెనుదిరిగాడు. లయోనెల్ మెస్సీ వెళ్లిపోవడంతో అతని స్థానంలో నీకో గొన్జాలెజ్ ఫీల్డ్‌లోకి వచ్చాడు.

Also Read: ‘టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ మా దేశంలో ఆడాల్సిందే’.. పాకిస్తాన్ బెదిరింపు

మ్యాచ్ మొత్తం కొలంబియా టీమ్ డామినేట్ చేసింది. మొత్తం 19 షాట్లు ప్రయత్నించగా నాలుగు సార్లు నెట్ వరకు బాల్ వెళ్లింది. మరోవైపు అర్జెంటీనా ప్లేయర్లు 11 షాట్లు కొట్టగా.. నెట్ వరకు ఆరుసార్లు చేరుకున్నారు. అందులో ఒకసారి లటారో మార్టినెజ్ విజయవంతంగా గోల్ చేయగలిగాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. గోల్ కొట్టిన లటారో ఒక ఎక్సట్రా ప్లేయర్. అనుకోకుండా సబ్సటిట్యాట్‌గా బరిలోకి దిగాడు. కానీ చరిత్ర సృష్టించాడు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×