EPAPER

PAK Vs AFG : ఆఫ్ఘన్ సంచలన విజయం.. పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టం..

PAK Vs AFG : ఆఫ్ఘన్  సంచలన విజయం.. పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టం..
 PAK vs AFG

PAK vs AFG : వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్గానిస్తాన్ దుమ్ము రేగ్గొడుతోంది. మొన్నటికి మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ని బోల్తా కొట్టించిన ఆఫ్ఘన్..ఆ గెలుపు గాలివాటం కాదని నిరూపించింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. అంతేకాదు పాక్ సెమీస్ ఆశలను మరింత సంక్లిష్టం చేసింది. ఇక ఇప్పుడు మిగిలిన నాలుగు మ్యాచ్ లను గెలవగలిగితేనే పాక్ రేస్ లోకి వస్తుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే అంటున్నారు.


చెన్నైలో జరిగిన పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ లో ఆఫ్గాన్ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి లక్ష్యం చేరుకుని శభాష్ అనిపించుకుంది. ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ గా 87 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్ ఎంపికయ్యాడు.

పాకిస్తాన్ మొదట ఆత్మవిశ్వాసంతోనే బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ ఓపెనర్ ఇమామ్ (17), సాద్ షకీల్ (25), రిజ్వాన్ (8) తక్కువ స్కోరుకే అవుట్ కావడం పాక్ వెన్ను విరిగినట్టయ్యింది. అయితే ఇమామ్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజామ్ జాగ్రత్తగా ఆడాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58) కలిసి జాగ్రత్తగా ఇన్నింగ్స్ ని తీర్చి దిద్దాడు. అయితే ఇద్దరూ నెమ్మదిగానే ఆడారు. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఫోర్లు, సిక్స్ లు కొట్టారు.


ఈ క్రమంలో అబ్దుల్లా అవుట్ అయిపోయాడు. తర్వాత పైన చెప్పినట్టు మిగిలినవాళ్లు క్యూ కట్టారు. ఈ క్రమంలో సెంచరీ చేస్తాడని అనుకున్న బాబర్ 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఇఫ్తికర్ (40) , షాదబ్ ఖాన్ (40) ఎడాపెడా కొట్టడంతో  నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పాక్ 282 పరుగులు చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఆఫ్గాన్ జట్టుని నిలువరించగలమనే నమ్మకంతోనే పాకిస్తాన్ బౌలింగ్ ప్రారంభించింది.

కాకపోతే లక్ష్యఛేదనలో ఆఫ్గాన్ ఓపెనర్లు జూలు విదిల్చారు. రహ్మనుల్లా గుర్భాజ్ (65), ఇబ్రహీం జుద్రాన్ (87) బలమైన పునాది వేశారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక్కడ నుంచైనా బ్రేక్ వస్తుందని పాకిస్తాన్ ఆశించింది కానీ ఆ ఛాన్స్ ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్ ఇవ్వలేదు. మళ్లీ రెండో వికెట్ 190 పరుగుల వద్ద పడింది.  
ఫస్ట్ డౌన్ వచ్చిన రహ్మత్ షా సైతం 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెకండ్ డౌన్ వచ్చిన షాహిది (48) చేసి నాటౌట్ గా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి టెన్షను పడకుండా, తొట్రుపాటు లేకుండా నింపాదిగా లక్ష్యం దిశగా సాగిపోయారు.

30 ఓవర్లు దాటిన తర్వాత నుంచి బాల్స్, రన్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. వాటిని అలా మెయింటైన్ చేస్తూ అవసరమైనప్పుడు ఒక ఫోరు, సిక్స్ కొడుతూ ఆ రన్ రేట్ పెరగకుండా చూసుకున్నారు. దాదాపు చివర 20 ఓవర్లు కూడా  రన్ టు రన్ జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ని గెలిపించిన తీరు చూసి అందరూ శభాష్ అంటున్నారు. 2023 వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ గెలిచిన రెండో మ్యాచ్ ఇది…ఇక్కడ నుంచి రాబోవు రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు నాంది పలుకుతుందోనని అంతా చూస్తున్నారు.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×