EPAPER

Akash Deep: రాంచీ టెస్టులో.. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్  ఆరంగేట్రం..

Akash Deep: రాంచీ టెస్టులో.. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్  ఆరంగేట్రం..
akash deep latest news

Bengal pacer Akash Deep debuts in Ranchi Test(Sports news today India): బెంగాల్ యువ పేసర్ 27 ఏళ్ల ఆకాశ్ దీప్ కి నాలుగో టెస్టులో ఆడే అవకాశం దక్కింది. తండ్రి నుంచి ప్రోత్సాహం కరువైనప్పటికి అంచెలంచెలుగా ఎదిగి, టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు. బెంగాల్ తరఫున 2019లో ఆరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో కలిపి 104 వికెట్లు తీశాడు.


ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత్ ఏ తరఫున బరిలోకి దిగిన ఆకాశ్ దీప్ 11 వికెట్లు తీసాడు. మరోవైపు ముకేష్ కుమార్ సైతం బీహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. కానీ వైజాగ్ టెస్ట్‌లో తేలిపోయాడు. దీంతో అతనికి చోటు కష్టమైంది. సిరాజ్ ను కూడా తప్పించి ముఖేష్ ని తీసుకుని, అదెంత పెద్ద తప్పు చేశామోనని టీమ్ ఇండియా బాధపడింది.

Read more: ఐపీఎల్ జాతరొచ్చింది.. నేటి నుంచి అమ్మాయిలతో ఆరంభం..!


అదే సమయంలో రివర్స్ స్వింగ్ రాబట్టడంలో ఆకాశ్ దీప్ దిట్ట. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్లు ఈ బౌలింగ్ ఆడలేక అవస్థలు పడుతున్నారు. అందుకే రివర్స్ స్వింగ్ సమర్థవంతంగా వేసే బుమ్రాకి వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ ఏమంటాడంటే రివర్స్ స్వింగ్  సమర్థవంతంగా వేయడంతో పాటు, భవిష్యత్తులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగలడనే ఆకాశ్‌దీప్‌కు అవకాశం ఇచ్చినట్లు చెప్పాడు.

మరి ఆకాశ దీప్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా లేదా? అనేది వేచి చూడాలి. అలాగే మహ్మద్ సిరాజ్ పైనే పేస్ భారమంతా పడింది. ఒకనాకొ సందర్భంలో తను ఫెయిల్ అయినప్పుడు బుమ్రా మోసేవాడు. ఇప్పుడు ఆకాశదీప్ భారాన్ని కూడా తనే మోస్తూ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తాడో వేచి చూడాల్సిందే.

గఇంగ్లాండ్ తో సిరీస్ లో నాలుగు టెస్టు మ్యాచ్ లకు కలిపి నలుగురు ఆటగాళ్లు ఆరంగేట్రం చేశారు.
రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఇప్పుడు ఆకాశ్ దీప్ ఉన్నారు.

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×