EPAPER

Ajit Agarkar on Shubman Gill: గిల్ ఏమీ శాశ్వతం కాదు: అజిత్ అగార్కర్

Ajit Agarkar on Shubman Gill: గిల్ ఏమీ శాశ్వతం కాదు: అజిత్ అగార్కర్

Ajit Agarkar Explains Why  Gill Was Appointed India’s deputy captain For Srilanka tour : శుభ్ మన్ గిల్ ఏమీ డిప్యూటీ కెప్టెన్ గా శాశ్వతం కాదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా గురించి చెప్పిన తను మరికొందరి ఆటగాళ్లపై క్లారిటీ ఇచ్చాడు. ఎవరినెందుకు పక్కన పెట్టారు? ఎవరికెందుకు అవకాశాలిచ్చారు? అనే అంశంపై వివరంగా మాట్లాడాడు.


శుభ్ మన్ గిల్ కెప్టెన్సీ బాగుందని డ్రెస్సింగ్ రూమ్ నుంచి పీడ్ బ్యాక్ వచ్చిందని అన్నాడు. అక్కడ ఆటగాళ్లు మాట్లాడుకున్న విధానం నచ్చింది. ఎందుకంటే మ్యాచ్ లో ఉన్న సంక్లిష్ట పరిస్థితులను బట్టి బౌలింగ్, పీల్డింగ్ మార్పులు బాగా చేస్తున్నాడని చెబుతున్నారు. అందుకే తనకి ఒక అవకాశమిచ్చాం. ఇదేం శాశ్వతం కాదని అన్నాడు. అలాగే కెప్టెన్ గా ఎవరూ గ్యారంటీ కాదని తెలిపాడు.

కేఎల్ రాహుల్ కూడా చాలాకాలం తర్వాత జట్టులోకి వస్తున్నాడు. రెగ్యులర్ పార్మాట్ కి దూరమైపోవడంతో మళ్లీ టచ్ లోకి వస్తే, తప్పక ఆలోచిస్తామని అన్నాడు. అలాగే రిషబ్ పంత్ పై పని ఒత్తిడి పెట్టదలుచుకోలేదని అన్నాడు. తనెలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆటలోకి వచ్చాడనేది అందరికీ తెలుసని అన్నాడు. అయినా వరల్డ్ కప్ లో తను చాలా కీలక ఇన్నింగ్స్ ఆడాడని తెలిపాడు. తనని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నాడు.


Also Read: హార్ధిక్‌పాండ్యా వ్యవహారం.. నోరు విప్పిన గంభీర్, అజిత్ అగార్కర్, శ్రీలంకకు బయలుదేరిన

ఇక అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడారు. కానీ జట్టులో 15మందిని మాత్రమే ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుంది. వారికి రాగల రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని అన్నాడు. రింకూ సింగ్ వరల్డ్ కప్ ముందు చాలా బాగా ఆడాడు. జింబాబ్వే పర్యటనలో పెద్దగా తనకి బ్యాటింగ్ అవకాశాలు రాలేదు. వచ్చినవాటిలో బాగానే ఆడాడు. కానీ శ్రీలంక పర్యటనలో ఎంపిక చేయలేకపోయామని అన్నాడు.

ఒకనాటి ఫాస్ట్ బౌలర్ అయిన అజిత్ అగార్కర్…ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఇంత క్లారిటీగా ఉండటంపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే తను క్రికెట్ ఆడేటప్పుడు చాలా మౌనంగా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. చిట్ చాట్ లకి దూరంగా ఉండేవాడు. అంతా కామ్ గోయింగ్ అన్నట్టు ఉండేవాడు. వచ్చామా? ఆడామా? వెళ్లామా? అంతేన్నట్టు ఉండేవాడు. కానీ ఇప్పుడు బీసీసీఐ సెలక్టర్ అయింతర్వాత ఏటి? మనోడిలో అంత విషయం ఉందా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×