EPAPER

Ajit Agarkar clarification: హార్ధిక్‌పాండ్యా వ్యవహారం.. నోరు విప్పిన గంభీర్, అజిత్ అగార్కర్, శ్రీలంకకు బయలుదేరిన

Ajit Agarkar clarification: హార్ధిక్‌పాండ్యా వ్యవహారం.. నోరు విప్పిన గంభీర్, అజిత్ అగార్కర్, శ్రీలంకకు బయలుదేరిన

Ajit Agarkar on t20i captaincy(Latest sports news telugu): శ్రీలంకతో జరిగే సిరీస్‌కు టీ20 కెప్టెన్‌‌గా హార్దిక్‌పాండ్యాను ఎంపిక చేయక పోవడంపై రకరకాలు వార్తలు చక్కర్లు కొట్టాయి. కావాలనే సెలక్షన్ కమిటీ ఆయన్ని దూరం పెట్టిందని కొందరంటే, కావాలనే కొత్త కోచ్ ఆయన్ని సైడున పెట్టారంటూ ఇలా రకరకాల వార్తలు హంగామా చేశాయి. చివరకు ఈ వ్యవహారంపై కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నోరు విప్పారు.


టీమిండియాకు హార్దిక్ పాండ్యా కీలకమైన ఆటగాడన్నారు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్. కెప్టెన్‌ గా నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని మ్యాచ్‌లు ఆడుతాడా? లేదా అనేది ఆలోచిస్తామన్నారు. ఈ విషయం లో ఆయన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయలేదన్నారు.

కేవలం ఫిట్‌నెస్ విషయంలో పాండ్యాకు కష్టమైన సవాల్ ఎదురైందన్నారు అజిత్ అగార్కర్. ఈ నిర్ణయం తీసుకోవడంతో కోచ్, సెలక్టర్లకు కొంత సమస్యగా మారిందని గుర్తుచేశాడు. మరో రెండేళ్లలో టీ 20 ప్రపంచ కప్ టోర్నీ జరగనుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపామని వివరించారు. కెప్టెన్‌గా ఆయన సక్సెస్ అవుతాడనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారాయన. అందుబాటులో ఉండే ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.


ALSO READ: గంభీర్ మాటే నెగ్గింది.. బౌలింగ్ కోచ్ గా మోర్నే మోర్కెల్

టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. రానున్న రోజుల్లో గంభీర్ విజన్ ఏంటో వెల్లడించాడు. జట్టులోని ప్రతీ ఒక్కరితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నాడు. సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వస్తుంటాయని, వాటిని పక్కన పెట్టి మా బాధ్యతలపై ఫోకస్ చేస్తామన్నాడు.

ఇక్కడ గంభీర్ అనేది ముఖ్యంకాదని, టీమిండియాకే ఫస్ట్ ప్రయార్టీ అని చెప్పుకొచ్చాడు గౌతమ్. రోహిత్ శర్మ, విరాట్‌కోహ్లీలు క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని, ఫిట్‌నెట్ కాపాడుకుంటే రానున్న వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ ఉందని వెల్లడించాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చి, వారిని ప్రొత్సహించడమే బాధ్యతగా చెప్పుకొచ్చాడు.

నా వైపు నుంచి ఆటగాళ్లకు మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నాడు గంభీర్. వారు హ్యాపీగా ఉంటే డ్రెస్సింగ్ రూమ్ సక్సెస్ అవుతుందన్నాడు. సహాయ సిబ్బంది ఇంకా ఫైనల్ కాలేదని, రెయిన్, అభిషేక్‌నాయర్‌తో కలిసి పని చేశానని గుర్తుచేశాడు. ప్రెస్ మీట్ తర్వాత టీమిండియా జట్టు ముంబై నుంచి శ్రీలంకకు బయలుదేరింది.

 

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×