EPAPER

Afghanistan beat Srilanka : అదరగొట్టిన ఆప్ఘన్.. లంకపై రెండో విజయం..

Afghanistan beat Srilanka : అదరగొట్టిన ఆప్ఘన్.. లంకపై రెండో విజయం..

Afghanistan beat Srilanka : మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ అదరగొట్టింది. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేల్లో శ్రీలంకపై ఆప్ఘన్ జట్టుకు ఇది రెండో విజయం. నాలుగేళ్ల కిందట జరిగిన వన్డేలో శ్రీలంకపై 91 పరుగుల తేడాతో గెలిచిన ఆప్ఘనిస్తాన్… తాజా వన్డేలో 60 రన్స్ తేడాతో గెలిచింది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘన్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 84 రన్స్ జోడించారు. ఓపెనర్ రహ్మానుల్లా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం సెంచరీతో అదరగొట్టాడు. వన్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా కూడా హాఫ్ సెంచరీ బాదాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్ కు 118 రన్స్ జోడించారు. చివర్లో నజీబుల్లా, నయీబ్ ధాటిగా ఆడటంతో… 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోరు చేసింది… ఆప్ఘనిస్తాన్. లంక బౌలర్లలో హసరంగకు 2 వికెట్లు దక్కగా… రజిత, ధనంజయ, లహిరు కుమార, మహీష్ తీక్షణకు తలో వికెట్ దక్కింది.

295 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను 234 పరుగులకే ఆలౌట్ చేసిన ఆప్ఘన్… 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్‌ నిస్సాంక, హసరంగా మినహా ఎవరూ పెద్దగా స్కోరు చేయలేదు. నిస్సాంక 85 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా… ఆఖరిలో హసరంగా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి 46 బంతుల్లోనే 66 రన్స్ చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు మొత్తం చేతులెత్తేయడంతో… శ్రీలంకకు సొంతగడ్డపైనే పరాభవం ఎదురైంది. ఆప్ఘన్‌ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ నాలుగు వికెట్లతో శ్రీలంకను దెబ్బతీయగా… నయీబ్‌ మూడు, యమీన్‌ రెండు, రషీద్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. శ్రీలంక-ఆప్ఘనిస్తాన్ మధ్య ఇప్పటిదాకా 5 వన్డేలు జరగ్గా… మూడింటిలో లంక నెగ్గింది. రెండు మ్యాచ్ ల్లో ఆప్ఘనిస్తాన్ గెలిచింది.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×