EPAPER

Abhishek Sharma: యువరాజ్ శిష్యుడే.. అభిషేక్ శర్మ

Abhishek Sharma: యువరాజ్ శిష్యుడే.. అభిషేక్ శర్మ

Abhishek Sharma Special Mention To Yuvraj Singh Abhishek Sharma Special Mention To Yuvraj Singh (Sports news Today): అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2024లో మార్మోగుతున్న పేరు.. ఈ సీజన్ లో  కనీసం 50 బంతులు ఆడిన బ్యాటర్లలో  తన స్ట్రయిక్ రేట్ అత్యుత్తమంగా నిలిచింది. అతను 217.56 తో పరుగులు చేస్తున్నాడు. మొత్తానికి హైదరాబాదీ బ్యాటర్ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 161 పరుగులు చేశాడు. ఈ బెస్ట్ స్ట్రయిక్ రేట్ జాబితాలో కోల్‌కతాకు చెందిన సునీల్ నరైన్ రెండో స్థానంలో, హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ మూడో స్థానంలో నిలిచారు.


ఇంతగొప్పగా ఆడుతున్న అభిషేక్ శర్మ గురువు మరెవరో కాదు. మన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ శిష్యుడు కావడం విశేషం. తను గురువులా లెఫ్ట్ హ్యాండ్ కూడా ఆడతాడు.

యువరాజ్ సింగ్.. తనకి గురువు ఎలా? అని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే యువరాజ్ ప్రొఫెషనల్ కోచ్ కాదు. కానీ అభిషేక్ శర్మను తీర్చిదిద్దిన వారిలో యువరాజ్ ముందు వరుసలో ఉంటాడు. అందుకనే తను యువరాజ్ తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తుంటాడు.


Also Read: కావ్య పాపలో ఉరకలెత్తిన ఆనందం..

ముంబయితో జరిగిన మ్యాచ్ లో కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అంతేకాదు 23 బంతుల్లో 68 పరుగులు చేసి అందరి ద్రష్టి ఆకర్షించాడు. ఇక చెన్నయ్ సూపర్ కింగ్స్ తో ఆడినప్పుడు కేవలం 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి, జట్టుకి టెన్షన్ తగ్గించాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.  తన జీవితంలో ముగ్గురికి కృతజ్ఞత ఉంటానని ఈ సందర్భంగా అభిషేక్ తెలిపాడు. ఒకరు యువరాజ్ సింగ్, రెండు బ్రయాన్ లారా, మూడు మానాన్నగారు అని తెలిపాడు. అయితే బ్రయాన్ లారా అప్పుడప్పుడు అభిషేక్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ టెక్నిక్స్ నేర్పుతుంటాడు.

అభిషేక్ తన టీ 20 కెరీర్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 90 ఇన్నింగ్స్ లో 148.98 స్ట్రయిక్ రేట్‌తో 2,348 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా బౌలింగ్‌లో కూడా 30 వికెట్లు పడగొట్టడం విశేషం.

పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించిన అభిషేక్ శర్మ వయసు 24 సంవత్సరాలు. 2016లో  ఆసియా కప్ యూత్ టోర్నమెంటులో ఆడి, ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2018లో అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న జట్టులో ప్రధాన సభ్యునిగా ఉన్నాడు. 2017లో ఇంగ్లాండ్ తో జరిగిన యూత్ వన్డే సిరీస్ కి కెప్టెన్ గా ఉన్నాడు.  ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కి ఆడాడు. తన రాష్ట్ర జట్టు పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నాడు. అదరగొడుతున్నాడు.

Tags

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×