EPAPER

Abhinav Bindra | ‘అనర్హత వేటు వినేశ్ ఫోగట్ ను సంవత్సరాల తరబడి వేధిస్తుంది’.. ఒలింపిక్స్ ఘటనపై అభినవ్ బింద్రా వ్యాఖ్య!

Abhinav Bindra | ‘అనర్హత వేటు వినేశ్ ఫోగట్ ను సంవత్సరాల తరబడి వేధిస్తుంది’.. ఒలింపిక్స్ ఘటనపై అభినవ్ బింద్రా వ్యాఖ్య!

Abhinav Bindra | క్రీడాకారుల ప్రపంచంలో భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. విజయం సాధిస్తే.. సంతోషంగా ఎగిరి గెంతేయడం, ఓడిపోతే నిరాశకు గురికావడం సాధారణం. కానీ కొన్ని సంఘటనలు క్రీడాకారులకు ఒక పీడకలలా మిగిలిపోతాయి. అలాంటి ఘటనే భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు ఎదురైంది. ఆమెకు పారిస్ ఒలింపిక్స్ లో అన్యాయం జరిగిందని 140 కోట్లకు పైగా భారతీయులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 50 కేజీల కుస్తీ పోటీల సెమీ ఫైనల్లో విజయం సాధించి ఫైనల్ ముంగిట నిలిచిన ఆమెపై కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేయడం.. అసలు ఆమెకు ఎటువంటి మెడల్ లేకుండా చేయడం ఏ విధంగానూ న్యాయం కాదు. అందుకే అనర్హత వేటు వినేశ్ ఫోగట్ కు సంవత్సరాల తరబడి ఒక పీడకలలా వేధిస్తుందని భారత లిజెండ్ షూటర్ అభినవ్ బింద్రా వ్యాఖ్యానించారు.


వినేశ్ ఫోగట్‌కు జరిగిన అన్యాయం పట్ల ఆయన సానుభూతి తెలుపుతూ.. క్రీడల్లో నియమాలు కఠినంగా ఉంటాయని.. ఆ నియమాలు లేకపోతే క్రీడల ఉనికే ఉండదని అభిప్రాయపడ్డారు. ఆ కఠిన నియమాలను అందరూ పాటించాల్సిందేనని చెప్పారు.

Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో


”వినేశ్ కు ఎదురైన పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. నిజం చెప్పాలంటే నేను ఒక స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నాను. నియమాలు చాలా స్పష్టంగా రూపొందించబడ్డాయి. ఆ నియమాలతోనే క్రీడలు కొనసాగుతున్నాయి. ఆటగాళ్లు నియమాలు పాటించపోతే.. అసలు ఆటే ఉండదు. కానీ నేను వినేశ్ స్థానంలో ఉండి ఆలోచిస్తే.. ఇది ఆమెకు చాలా కష్టమైన సమయం. ఆమెకు ఎదురైన పరిస్థితులు తెలుసుకొని భారతీయులంతా బాధపడుతున్నారు. మేమంతా ఆమెకు అండగా ఉన్నాం. ఇటీవలే ఆమెను నేను కలిశాను. ఆమె ఒలింపిక్స్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసింది. కానీ ఆ కేసులో తీర్పు వాయిదా పడింది. నేను చట్టాల విషయంలో నిపుణుడిని కాను. అందుకే మనమంతా ఓర్పుతో న్యాయం కోసం ఎదురు చూడాలి.” అని అన్నారు.

వినేశ్ ఫోగట్ అనర్హతపై సోర్ట్స్ కోర్టులో విచారణ పూర్తైంది. శనివారం రాత్రి తీర్పు రావాల్సి ఉండగా.. దానిని ఆదివారం రాత్రికి వాయిదా వేశారు. మరోవైపు శనివారం రాత్రి అభినవ్ బింద్రాకు ఒలింపిక్స్ కమిటీ ప్రతిష్టాత్మక ‘ఒలింపిక్స్ ఆర్డర్’ తో సన్మానించింది. ఒలింపిక్స్ లో ఇదే అత్యుత్తమ పురస్కారం. ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన ఆటగాళ్లకు మాత్రమే ఈ అవార్డు ప్రదానం చేస్తారు.

Also Read: అభినవ్ బింద్రాకు ప్రతిష్టాత్మక ‘ఒలింపిక్ ఆర్డర్’.. పారిస్‌లో భారత షూటర్‌కు ఘన సన్మానం!

 

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×