EPAPER

Ravichandran Ashwin: 100వ టెస్టులో చరిత్ర సృష్టించిన అశ్విన్..

Ravichandran Ashwin: 100వ టెస్టులో చరిత్ర సృష్టించిన అశ్విన్..
Ravichandran Ashwin
Ravichandran Ashwin

5 Records Ravichandran Ashwin Broke 100th Test: రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారంటూ లేరు. ఇన్నాళ్లూ రికార్డుల పరంగా చాపకింద నీరులా ఉన్న అశ్విన్ ఒక్కసారి ఉవ్వెత్తున లేచాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఓవరాల్ గా 26 వికెట్లతో నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న అశ్విన్.. మరో అరుదైన ఘనత సాధించాడు.


అది తను ఆడిన వందో టెస్ట్ మ్యాచ్ లో జరగడంతో థ్రిల్ ఫీలవుతున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లు తీశాడు. దీంతో భారత్ తరఫున అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు.

తను ఆడిన 100 టెస్టుల్లో ఇలా 5 వికెట్లను 36 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. నిన్నటి వరకు ఈ రికార్డ్ అనిల్ కుంబ్లే పేరు మీద ఉండేది. తను 132 మ్యాచ్ ల్లో ఈ ఫీట్ సాధించాడు.తాజా మ్యాచ్ లో కుంబ్లే ఆల్ టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.


Read More: రోహిత్ శర్మ.. రెండు షాకింగ్ న్యూస్ లు

ప్రపంచం మొత్తమ్మీద చూస్తే ముత్తయ్య మురళీధరన్ 230 ఇన్నింగ్స్ లో 67 సార్లు 5 వికెట్లు తీస్తే, షేన్ వార్న్ 273 ఇన్నింగ్స్ లో 37 సార్లు తీశాడు. రిచర్డ్ హాడ్లీ 150 ఇన్నింగ్స్ లో 36 సార్లు తీశాడు. ఇప్పుడు అశ్విన్ 189 ఇన్నింగ్స్ లో 36 సార్లు తీస్తే, కుంబ్లే 236 ఇన్నింగ్స్ ఆడి 35 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించారు.

ఆఖరి టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి మొత్తం అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్టు తీశాడు. ఓవరాల్ గా 5 టెస్టు మ్యాచ్ ల్లో కలిపి 26 వికెట్లు తీసి నెంబర్ వన్ అయ్యాడు. అంతేకాదు ఒకే టెస్ట్ సిరీస్ లో ఇలా అత్యధిక వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్ కూడా అశ్విన్ అంటున్నారు.

అలాగే నూరో టెస్టులో తన డకౌట్ అయ్యి, ఒక చెత్త రికార్డు కూడా తెచ్చుకున్నాడు. కనీసం ఒక్క పరుగైనా చేయాల్సిందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×