EPAPER

2023 Cricket Records : రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ టాపర్లు..

2023 Cricket Records : రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ టాపర్లు..

2023 Cricket Records : 2023 సంవత్సరంలో భారతీయ క్రికెటర్లు టాప్ గేర్ లో ఉన్నారు. విజయాలను పక్కన పెడితే, వ్యక్తిగత ప్రదర్శనలో మనవాళ్లని మించిన వారు లేరనే చెప్పాలి. ముఖ్యంగా బౌలింగ్ లో రవీంద్ర జడేజా 66 వికెట్లతో టాపర్ గా ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే శుభ్ మన్ గిల్ 2154 పరుగులతో నెంబర్ వన్ గా ఉన్నాడు.


ఇంకా చెప్పాలంటే బ్యాటింగ్ విభాగంలో టాప్ 10 లో పలువురు భారత ఆటగాళ్లు నిలిచారు. వారిలో ముఖ్యంగా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. గిల్ 52 ఇన్నింగ్స్ ఆడి 2154 పరుగులు చేశాడు. తర్వాత స్థానంలో విరాట్ కొహ్లీ ఉన్నాడు. కేవలం 36 ఇన్నింగ్స్ ల్లో 2048 పరుగులు చేశాడు. అదే గిల్ కన్నా 16 ఇన్నింగ్స్ తక్కువ ఆడాడు. ఒకవేళ అవి కూడా ఆడి ఉంటే, కనీసం 3వేల పరుగులు దాటేవాడని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే రోహిత్ శర్మ 39 ఇన్నింగ్స్ లో 1800 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.

బౌలింగ్ విషయానికి వస్తే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి జడేజా బౌలింగ్ లయ తప్పింది. వికెట్లు పడటం లేదు. ఓవరాల్ గా చూస్తే మాత్రం త2023లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసుకున్న అంతర్జాతీయ బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ మ్యాచ్ ల్లో 66 వికెట్లు తీసి భళా అనిపించుకున్నాడు. అటు బ్యాటింగ్ లో కూడా రాణించి 613 రన్స్ చేశాడు. ఇందులో రెండు ఆఫ్ సెంచరీలున్నాయి. ఫలితంగా ఒక ఏడాదిలో అటు 600పైగా పరుగులు, ఇటు బౌలింగ్ లో 60కి పైగా వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా జడేజా నిలిచాడు.


రవీంద్ర జడేజా తర్వాత కుల్‌దీప్ యాదవ్ 63 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ 60 వికెట్లతో ఐదో ప్లేసు, మహమ్మద్ షమీ 56 వికెట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. షమీకి మరికొన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే వీరందరికన్నా పైన ఉండేవాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వయసు పరంగా 35 ఏళ్లు రావడంతో భవిష్యత్తులో షమీ అప్పుడప్పుడే అంతర్జాతీయ ఆటలో కనిపిస్తాడని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×