EPAPER

Ollie Pope Creates History: ఏడు దేశాలపై ఏడు సెంచరీలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డ్

Ollie Pope Creates History: ఏడు దేశాలపై ఏడు సెంచరీలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డ్

Ollie Pope Creates History: ఓలీపోప్.. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్.. ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఆఖరికి క్రికెట్ లో బ్రాడ్ మన్-సచిన్, కొహ్లీ ఎవరికీ కూడా అందని అరుదైన రికార్డు సాధించి.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.


ఇటీవల తను ఫామ్ లేక, తంటాలు పడుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లో రెండు టెస్టుల్లో కేవలం 30 పరుగులే చేశాడు. అంటే ఎంత వెనుకపడి ఉన్నాడో.. ఇట్టే అర్థమవుతోంది. చివరికి ఆఖరిదైన మూడో టెస్టులో ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. బజ్ బాల్ తరహాలో ఆడి సెంచరీ చేశాడు. 103 బంతుల్లో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇంతవరకు బాగానే ఉంది. ఇందులో 147 ఏళ్ల క్రికెట్ లో సాధ్యం కాని రికార్డేం సాధించాడని అనుకుంటున్నారా? అయితే వినండి..


ఇంతవరకు పోప్ 49 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. కానీ తను చేసిన సెంచరీలు 7 మాత్రమే.. కానీ అవి చాలా వెరైటీగా చేశాడు. అదేమిటంటే ఒకొక్క సెంచరీ.. ఒకొక్క దేశంపై చేశాడు. అంటే మనవారిలా ఒక దేశంపై 10, 5 సెంచరీలు కాదు.. తనింతవరకు ఆడిన ప్రతీ దేశంపై ఒకొక్క సెంచరీ మాత్రమే చేశాడు. అంటే తను చేసిన తొలి సెంచరీనీ ఏడు వివిధ దేశాలపై చేశాడు.

ఒక్క ఆస్ట్రేలియాపైనే పోప్ బాకీ ఉన్నాడు. భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్ ఇలా చేసుకుంటూ వెళుతున్నాడు. ఏదో లెక్క మీదే చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. ఒకసారి ఆ సెంచరీల లెక్కలు చూస్తే..

Also Read: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

పోప్… తొలి టెస్ట్ సెంచ‌రీని 2020లో దక్షిణాఫ్రికాపై (135 నాటౌట్) సాధించాడు.

నాటింగ్‌హామ్‌లో.. 2022లో న్యూజిలాండ్‌పై (145) రెండో శ‌త‌కం వచ్చింది.

2022లో పాకిస్తాన్ పై మూడో శతకం (108) సాధించాడు.

2023 లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్ పై (205) నాలుగో శతకం.. డబుల్ సెంచరీ చేశాడు.

2024లో భారత్ పై హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఐదో శతకం… 196 పరుగులు చేశాడు.

2024లో వెస్టిండీస్ పై (121) ఆరో సెంచరీ చేశాడు.

2024లో శ్రీలంకపై ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో 7వ సెంచరీ (103 నాటౌట్) చేశాడు

ఇక టెస్టు క్రికెట్ ఆడే జ‌ట్ల‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్‌లపై మాత్ర‌మే పోప్ సెంచరీ చేయలేదు. దీనికి కార‌ణం పోప్ తన కెరీర్‌లో ఈ నాలుగు జ‌ట్ల‌తో ఇప్ప‌టివ‌ర‌కు ఆడలేదు. మరి తన తర్వాత సిరీస్ ల్లో ఆడితే తప్పక సెంచరీ చేసేందుకు ప్రయత్నిస్తాడని అంటున్నారు.

అయితే పోప్ 49 టెస్టు మ్యాచ్ ల్లో గొప్పగా ఆడింది లేదు. 35.28 సగటుతో 2823 పరుగులు చేశాడు. 13 హాఫ్ సెంచరీలున్నాయి.
సిరీస్ మొత్తమ్మీద ఒక మ్యాచ్ లోనే ఆడతాడనే పేరు సంపాదించాడు. ప్రస్తుతం గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ జట్టుకి దూరం కావడంతో తాత్కాలిక కెప్టెన్ గా పోప్ వ్యవహరిస్తున్నాడు.

ఇకపోతే ఇంగ్లండ్ కెప్టెన్ గా అత్యంత వేగవంతమైన సెంచరీ (103 బంతుల్లో 103 నాటౌట్) చేసిన రెండో కెప్టెన్ గా పోప్ నిలిచాడు.  ఇంతకుముందు డేవిడ్ బూన్ అయితే భారత్ పై 95 బంతుల్లోనే సెంచరీ చేసి నెంబర్ వన్ గా ఉన్నాడు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×