EPAPER

Zebronics: జిబ్రానిక్స్ నుంచి అదిరిపోయే గేమింగ్ హెడ్‌ఫోన్స్.. ధర కూడా తక్కువే

Zebronics: జిబ్రానిక్స్ నుంచి అదిరిపోయే గేమింగ్ హెడ్‌ఫోన్స్.. ధర కూడా తక్కువే


Zebronics Gaming Headphones: నేటి యువత ఎక్కువగా పీసీ గేమింగ్‌కు అట్రాక్ట్ అవుతున్నారు. చాలా సేపు వాటితోనే గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ గేమింగ్ అనుభవం మరింత ఎగ్జైటింగ్ ఉండేందుకు భారీ ధర పెట్టి హెడ్‌ఫోన్లను కొంటున్నారు. అయితే ఈ గేమింగ్ ఆడేవారి కోసం ప్రముఖ కంపెనీలు కూడా రకరకాల డిజైన్లు, అద్భుతమైన సౌండింగ్‌తో కొత్త కొత్త హెడ్‌ఫోన్లను తీసుకొస్తున్నాయి.

ముఖ్యంగా ఈ గేమింగ్ ఆడేవారికి బెస్ట్ సౌండింగ్ అందించడం కోసం స్పెషల్ హెడ్‌ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే వీటి ధరలు కూడా అధికంగా ఉండటంతో చాలామంది వీటిని కొనేందుకు సంకోచిస్తున్నారు. ఆన్‌లైన్లలో డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరకు కొనుక్కోవాలని చూస్తున్నారు. అయిలా అలా ప్లాన్ చేసుకునే వారికి గుడ్ న్యూస్.


ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు జిబ్రానిక్స్ తాజాగా అదిరిపోయే గేమింగ్ హెడ్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. ZEB-Blitz C, ZEB-Haovc పేరుతో రెండు గేమింగ్ హెడ్‌ఫోన్‌లను తాజాగా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్‌లు అద్భుతమైన డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇది గేమింగ్ సమయంలో యూజర్‌లకు అదిరిపోయే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.

READ MORE: 48గంటల బ్యాటరీతో నడిచే ఇయర్ బడ్స్.. ధర కూడా చాలా అంటే తక్కువ!

అంతేకాకుండా గేమింగ్ వినోదాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. వీటి ధరలను కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉంచింది. ఇక వీటి ఫీచర్ల విషయానికొస్తే.. ZEB-బ్లిట్జ్ C, ZEB-హావోక్ హెడ్‌ఫోన్‌లు రెండూ డాల్బీ ఆట్మోస్, 50mm నియోడైమియమ్ డ్రైవర్‌లతో కలిసి మంచి ఆడియో అనుభవాన్ని అందిస్తాయి.

ఇది వినడానికి సొంపుగా మంచి బేసి, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది మల్టీ కలర్ లైట్లు గేమింగ్ సెటప్‌ను మరింత ట్రెండీగా, ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ రెండు మోడల్‌లు తేలికపాటి డిజైన్, సాఫ్ట్-కుషన్డ్ ఇయర్ కప్పులు, ప్యాడెడ్ హెడ్‌బ్యాండ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి.

తద్వారా ఎన్ని గంటలు గేమింగ్ చేస్తున్నా ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించవు. ZEB-Blitz C టైప్-సి పోర్ట్ ద్వారా కన్వర్ట్ అయి ఆడియోతో గేమింగ్ ఆడియోను మరింత స్థాయికి తీసుకువెళుతుంది. ఇక మరొక డివైజ్ ZEB-హావోక్ సస్పెన్షన్ హెడ్‌బ్యాండ్‌తో మృదువైన డిజైన్‌ను అందిస్తుంది.

READ MORE: 6/128జీబీ వేరియంట్.. రూ.6 వేలకే..

ఎక్కువగా గేమింగ్ అనుభవాన్ని ఇష్టపడే గేమర్‌లకు ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఇకపోతే వీటి ధరల విషయానికొస్తే.. Zeb-Blitz C బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీనిని అమెజాన్‌లో చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అమెజాన్‌లో దీని ధర రూ.1299గా ఉంది.

Tags

Related News

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Lunar Space Station: చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

Vivo Y19s Mobile: వివో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే !

Indian Mobile Number : భారత్​లో ఫోన్ నెంబర్లకు +91 కోడ్ ఇచ్చింది అందుకే – ఈ విషయాలు మీకు తెలుసా?

Top IT Companies : యాపిల్, గూగుల్​ టు ఫేస్​బుక్​, ఇన్​స్టా – ఈ 8 బడా సంస్థల అసలు పేర్లు తెలుసా?

Readmi Note 13 5G : 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ – ఓరి బాబాయ్​.. రూ.14 వేలకే బ్రాండెడ్​​ స్మార్ట్ ఫోన్​

Redmi A4 5G : రెడ్ మీ అరాచకం.. స్నాప్ డ్రాగన్ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ మెుబైల్ మరీ అంత చీపా!

Big Stories

×