EPAPER

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Xiaomi 15 Series: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి గ్లోబల్ వైడ్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎన్నో ఫోన్లను లాంచ్ చేస్తూ హవా చూపిస్తుంది. బడ్జెట్ ఫోన్లతో పాటు ప్రీమియం ఫోన్లను రిలీజ్ చేసి ఎంతో మందిని అట్రాక్ట్ చేసింది. ఇక భారతదేశంలో సైతం సత్తా చాటుతోంది. రకరకాల మోడళ్లను పరిచయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలో మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. Xiaomi తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 15ని వచ్చే నెలలో అంటే అక్టోబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


అయితే కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఒకదాని తర్వాత ఒకటి సర్టిఫికేషన్‌లలో కనిపించడంతో వచ్చే నెలలో ప్రారంభించబడుతుందని తెలుస్తోంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో Xiaomi 15, 15 Pro వంటి మోడళ్లు ఉన్నాయి. ఇప్పుడు Xiaomi 15 ఒక ముఖ్యమైన సర్టిఫికేషన్ పొందింది. దాని ప్రకారం.. Xiaomi 15 స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సామర్థ్యం వెల్లడైంది.

అదే సమయంలో ఓ నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 24129PN74C మోడల్ నంబర్‌తో తాజాగా ఓ సర్టిఫికేషన్‌లో కనిపించింది. ఇది IMEI డేటాబేస్‌లో కూడా ఇవ్వబడింది. Xiaomi 15లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ని అందించినట్లు చెప్పబడింది. కాగా ఈ కొత్త మోడల్‌ కంటే దీని ముందు మోడల్ అయిన Xiaomi 14లో కూడా కంపెనీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించింది. దీని కారణంగా ఈ ఫోన్ కేవలం 31 నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదని క్లెయిమ్ చేయబడింది.


Also Read: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

ఈ విషయంలో 90W ఛార్జింగ్ వేగం చాలా స్పీడ్‌గా పరిగణించబడుతుంది. ఇదిలా ఉంటే Xiaomi 15 కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే మునుపటి మోడల్ లాగా ఇది కూడా 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌కి సంబంధించి ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Xiaomi 15 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా ఇందులో 4900mAh వరకు బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. దీని వనిల్లా మోడల్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో రాబోతున్నట్లు సమాచారం. దానిపై డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించే అవకాశం ఉంది. దీంతోపాటు మరో రెండు లెన్స్‌లు 50MP అల్ట్రావైడ్, టెలిఫోటో సెన్సార్‌లు కూడా ఉండే అవకాశం ఉంది.

అలాగే ఫోన్‌ సేఫ్టీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కూడా అందించే అవకాశం ఉంది. ఇక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఫోన్‌లో IP68 రేటింగ్‌ను అందించే ఛాన్స్ కనిపిస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Related News

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Big Stories

×