EPAPER

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Xiaomi 14T Series: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ షియోమి దేశీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందువల్లనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తుంది. ఇందులో భాగంగానే Xiaomi 14T సిరీస్ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఈ సిరీస్‌లో Xiaomi 14T, Xiaomi 14T ప్రో మోడళ్లు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ఈ నెల అంటే సెప్టెంబర్ 26 2024న అధికారికంగా లాంచ్ కానుంది. దీంతో లాంచ్ సమయం దగ్గర పడుతుండటంతో ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేసన్లు, డిజైన్ సహా ఇతర వివరాలు లీక్ అవుతున్నాయి.


లీకైన ఫొటోల ప్రకారం.. ఈ రెండు ఫోన్లు వెనుక భాగంలో పైన-ఎడమ వైపు పెద్దగా, స్క్వేర్ టైప్ కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సార్, ఎల్‌ఈడీ ఫ్లాష్ అండ్ కోకా కోలా బ్రాండింగ్‌ను కలిగి ఉంటుంది. కాగా షియోమి 14టి ఫోన్ మ్యాటే ఫినిష్‌తో ఫ్లాట్ ఎడ్జెస్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక 14T ప్రోలో వర్వ్డ్ ఎడ్జెస్, గ్లాస్ బ్యాక్ ఉంటుందని చెప్పబడింది. ఇక Xiaomi 14T ఫోన్ లెమన్ గ్రీన్, టైటాన్ బ్లాక్, టైటాన్ బ్లూ, టైటాన్ గ్రేతో సహా అనేక కలర్ ఆప్షన్లలో లభిస్తాయని అనుకుంటున్నారు. అదే సమయంలో 14T ప్రో టైటాన్ బ్లాక్, టైటాన్ బ్లూ, టైటాన్ గ్రేలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఇక Xiaomi 14T సిరీస్‌లో డిస్‌ప్లే విషయానికొస్తే.. ఈ సిరీస్‌ ఫోన్‌లలో 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ రెండు మోడళ్ల స్క్రీన్‌లు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండనున్నాయి. అలాగే 4000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తాయని చెప్పబడింది. అంతేకాకుండా Xiaomi HDR10+ సపోర్ట్, Dolby Vision, Xiaomi షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ వంటి అధునాతన డిస్‌ప్లే టెక్నాలజీలను ఇంటిగ్రేట్ చేసింది. వీటితో పాటు Xiaomi 14T సిరీస్‌లోని ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇందులో MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్ ఉంటుంది.


Also Read: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

14T ​​ప్రోలో డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్ ఉంటుంది. ఇది ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. కాగా రెండు మోడల్‌లు 12GB LPPDDR5X RAMతో వస్తాయి. అలాగే 256GB నుండి 512GB (UFS 4.0) వరకు స్టోరేజీ ఆప్షన్‌లు ఉండనున్నాయి. ఇక ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Xiaomi కొత్త HyperOSలో రన్ అవుతాయి. ఇక కెమెరా విషయానికొస్తే.. Xiaomi కెమెరా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే 14T సిరీస్‌ కోసం లైకాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

దీనిబట్టి 14టి సిరీస్‌కు ఇది పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. Xiaomi 14T ఫోన్ OISతో 50MP Sony IMX906 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే సమయంలో 14T ప్రో 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు ప్రైమరీ షూటర్‌గా 50MP లైట్ ఫ్యూజన్ 900 సెన్సార్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ఇదిలా ఉంటే ఫోన్‌లో అధునాతన AI ఫీచర్లు అందించననున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. Xiaomi 14T ఫోన్‌ 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రో మోడల్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌, 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్‌లు 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇక Xiaomi 14T సిరీస్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. అలాగే వీటి ధరల విషయానికొస్తే.. Xiaomi 14T లోని 12GB/ 256GB మోడల్ ధర 699 యూరోలు ($777)గా. అలాగే 14T ప్రోలోని 12GB/ 512GB మోడల్ ధర 899 యూరోలు ($1,000)గా ఉండే ఛాన్స్ కనిపిస్తుందని తెలుస్తోంది.

Related News

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Big Stories

×