EPAPER
Kirrak Couples Episode 1

Whatsapp New Features 2024 : వాట్సాప్ ప్రియులకు కిక్ ఇచ్చే అప్డేట్.. కొత్తగా ఈ 3 ఫీచర్స్

Whatsapp New Features 2024 : వాట్సాప్ ప్రియులకు కిక్ ఇచ్చే అప్డేట్.. కొత్తగా ఈ 3 ఫీచర్స్

Whatsapp New Features 2024: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్నీ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ లో ఏఐ పేరుతో మెటా తన సేవలను అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ వాట్సప్‌లో మూడు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఏఐ సంభాషణల్ని మరింత మెరుగుపరిచేలా రియల్‌ టైమ్‌ కన్వర్జేషన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక మెటా ఏఐలో ఫొటోలను నచ్చినట్లుగా ఎడిట్​ చేసి పంపేలా సరికొత్త ఫీచర్లను జోడించింది. దీని ద్వారా యూజర్స్​ తమ ఐడీయాలను మరింత తేలికగా వ్యక్త పరిచే అవకాశం ఉన్నట్లు మెటా తెలిపింది. ఇక వాట్సప్ తీసుకువచ్చిన ఆ మూడు ఫీచర్ల ప్రత్యేకతలేంటో ఓసారి తెలుసుకుందా.


టాక్​ టు మి ఫీచర్​ – ఈ సరికొత్త ఫీచర్ తో యూజర్ సొంత వాయిస్‌తోనే రియల్‌ టైమ్‌ సంభాషణలు చేసే అవకాశం కల్పింస్తుంది. ఇక ఏవైనా ప్రశ్నలు అడగితే తగిన రీతిలో సమాధానాలు చెప్పటమే కాకుండా… స్పష్టంగా వివరిస్తుంది. ఇక మూడ్‌కు తగ్గట్లు జోక్స్ సైతం వేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. మెటా ఏఐ వాయిస్‌ను కూడా మార్చుకునే అవకాశాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ తో అక్వాఫినా, క్రిస్టెన్ బెల్, డేమ్ జుడి డెంచ్​, కీగన్-మైఖేల్ కీ జాన్ సెనా వంటి సెలబ్రెటీల వాయిస్‌ను సైతం సెట్ చేసుకునే అవకాశాన్ని మెటా కల్పిస్తుంది.

లుక్​ యట్​ దిస్​ – ఈ అప్డేట్ తో ఫోటోతో ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. కొన్నాళ్ల క్రితం మెటా వాట్సాప్ లో తీసుకువచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో… మెటా ఏఐ చాట్ ను క్లిక్ చేసి ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించింది. ఇక ఈ లేటెస్ట్ అప్ డేట్ తో ఫొటోతోనే సమాధానం దొరుకుంది. ఇక ఏఐ చెప్పిన సమాధానాలు అర్థంకాలేనప్పుడు, తెలియని భాషలో సమాధానం ఉన్నప్పుడు ఈ లుక్ యట్ దిస్ అప్డేడ్ ఉపయోగపడుతుంది. టెక్ట్స్ లో వివరించలేని విషయాలపై ప్రశ్నలు తలెత్తినప్పుడు నేరుగా అందుకు సంబంధించిన ఫొటో చూపించి సమాధానం అడిగే అవకాశం ఉంటుంది.


ALSO READ : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

ఎడిట్ మై ఫొటో – మెటా తీసుకువచ్చిన 3 అప్డేట్స్ లో 2 ఫీచర్లు ఫ్రీ వెర్షన్​ చాట్ జీపీటీలో అందుబాటులో ఉండగా… ఎడిట్ మై ఫోటో ఫీచర్ మాత్రం ఫొటోలను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక వాట్సాప్ వాడే యూజర్స్​ కు ఇప్పటివరకూ ఫోటోను పంపించుకునే అవకాశం మాత్రమే ఉండగా… ఈ ఆఫ్షన్ తో ఫోటోలను ఎడిట్​ కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫీచర్ తో ఫోటోలను ఎడిట్ చేసి నచ్చినట్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫోటోకు సంబంధించిన కలర్ తో పాటూ.. బ్యాక్‌గ్రౌండ్‌లోని వ్యక్తులను తొలగించటం సైతం చేస్తుంది. ఈ స్పెషల్ ఫీచర్ తో ఇకపై ఫొటో ఎడిటింగ్ కోసం వేరే వెబ్ సైట్స్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని.. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని మెటా తెలిపింది.

Related News

How To Check iPhone Is Real Or Fake : ఐఫోన్ కొంటున్నారా? మరి అది ఒరిజినలా? ఫేకా.. అనేది ఇలా కనిపెట్టేయండి

Jio Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

Iphone 15 : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

Samsung : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Amazon Great India Festival Sale 2024 : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!

iPhone 15: మతిపోగొట్టే ఆఫర్.. జస్ట్ రూ.15,650కే ఐఫోన్ 15, ఎలా కొనాలో తెలుసా?

Big Stories

×