EPAPER

WhatsApp: షాకింగ్..85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం!

WhatsApp: షాకింగ్..85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు ఉన్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. మ‌న‌దేశంలోనూ ఎక్కువ మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ ఇదే. ఇండియాలో మొత్తం 60 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఎవరి స్మార్ట్ ఫోన్ చూసినా అందులో తప్పకుండా వాట్సాప్ కనిపిస్తుంది. ఇందులో సమాచారాన్ని వేగంగా, సులభంగా చేరవేయెచ్చు. కేవలం సందేశాలను మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు సైతం పంపవచ్చు. అలాంటి వాట్సాప్ కు పోటీగా చాలా యాప్స్ వచ్చాయి. హైక్, టెలిగ్రామ్ తో పాటు కొన్ని యాప్స్ రంగంలోకి దిగాయి.


కానీ వాట్సాప్ వాటికంటే అప్డేట్స్‌తో యూజర్స్‌ను మెప్పించడంతో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోకుండా ఉంది. వాట్సాప్‌కు సంబంధించి మరో గొప్ప విషయం ఏంటేంటే..ఇది యాడ్స్ ఫ్రీ కావడంతో పాటు వినియోగదారుల సమాచారానికి ఎంతో భద్రతను ఇస్తుంది. ఇప్పుడు ఆ భద్రత కోసమే మరో కీలక నిర్ణయం తీసుకుంది. మ‌న‌దేశంలో చెెడు ఖాతాలు అనిపించిన వాటిపై కొరడా విసిరింది. సెప్టెంబర్ నెలలో మొత్తం 85 లక్ష‌ల ఖాతాల‌ను గుర్తించి వాటిపై నిషేదం విధించింది. ఇవి నియమావ‌ళికి విరుద్ధంగా ఉన్నాయని సోష‌ల్ మెసేజింగ్ యాప్ భావించిన‌ట్టు స‌మాచారం. సెప్టెంబ‌ర్ 1 నుండి 30వ తేదీ వ‌ర‌కు 85,84,000 ఖాతాల‌ను నిషేధించ‌గా వీటిలో 16,58,000 ఖాతాల‌పై ఎలంటి ఫిర్యాదు అంద‌క‌పోయిన‌ప్ప‌టికీ ముందుగానే న‌ఖిలీవిగా గుర్తించి నిషేధించిన‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌ల కాలంలో వాట్సాప్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో స్పందిస్తూ సెప్టెంబర్ లో పలు ఖాతాలను బ్లాక్ చేసినట్టు ప్రకటించింది. అదే విధంగా ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక ముందు కూడా పారదర్శకంగా వ్యవహరించడాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. తమ చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కూడా భవిష్యత్తులో నివేదికల్లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది యూజర్లు తమకు నచ్చని వ్యక్తులను బ్లాక్ చేసే అవకాశం కల్పించామని, అభ్యంతకర కంటెంట్ పై ఫిర్యాదులు చేసే వెసులుబాటు కూడా కల్పించామని తెలిపింది.


Related News

Best Smart Phones List 2024 : ధరతో పాటు ఫీచర్స్ కెవ్వుకేక.. తాజాగా లాంఛ్ అయ్యి దూసుకుపోతున్న బెస్ట్ మెుబైల్స్ ఇవే!

Realme GT 7 Pro Oppo Reno 13 Series : ఒక్కరోజు తేడాతో వచ్చేస్తున్న రియల్ మీ, ఒప్పో.. మరి వీటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

Oppo Reno 13 Series : అప్పు చేసైనా ఈ ఒప్పో మెబైల్ కొనేయాల్సిందే… రెనో 13 వచ్చేది ఆరోజే.. ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

OnePlus 13 vs iQOO 13 : పిచ్చెక్కించే ఫీచర్స్ తో వచ్చేసిన ఐక్యూ, వన్ ప్లస్.. మరి ఈ స్నాప్ డ్రాగన్ మెుబైల్స్ లో బెస్ట్ ఏదంటే!

Flipkart Festival Days Sale 2024 : ఇచ్చిపడేసిన ఫ్లిప్కార్ట్.. 50MP కెమెరా, 5000mahబ్యాటరీ మెుబైల్స్ పై ఊహించని తగ్గింపు

Best Mobiles Under 10000 : మెుబైల్స్ పై అదిరిపోయే ఆఫర్స్.. రూ.10వేలలోపే రియల్ మీ, రెడ్ మీ, పోకో ఫోన్స్!

Snapdragon 8 Gen 3 : బెస్ట్ స్నాప్ డ్రాగన్ మెుబైల్స్ ఇవే.. క్వాలిటీ, ధర, ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

Big Stories

×