EPAPER

Vivo y300 Plus : బెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసిన vivo.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!

Vivo y300 Plus : బెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసిన vivo.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!

Vivo y300 Plus : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసింది. కర్వ్డ్ హ్యాండ్ సెట్ డిస్ప్లే తో వివో వై 300 ప్లస్ పేరుతో మొబైల్ ను విడుదల చేసింది.


వివో కంపెనీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదిరిపోయే ఫీచర్స్ తో పాటు అబ్బరపరిచే అప్డేట్స్ ను తీసుకొస్తుంది. ఇక తాజాగా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. వివో వై 300 ప్లస్ పేరుతో అత్యాధునికంగా డిజైన్ చేసిన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి స్టోరేజ్ తో పాటు 50 ఎంపీ కెమెరాను కలిగి ఉంది.

స్పెసిఫికేషన్స్ – వివో వై 300 ప్లస్ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల ఎఫ్ హెచ్ డి త్రీడి కర్వడ్ డిస్ప్లే తో రిలీజ్ అయింది. 120mah రిఫ్రిష్ రేట్ తో పాటు 1300 మినిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ 14 funtouch OS 14 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ లాంచ్ అయింది.


వివో వై 300 స్మార్ట్ ఫోన్ 6nm స్నాప్ డ్రాగన్ 685 soc చిప్సెట్ తో లాంచ్ అయింది. 8gb lpddr4x ర్యామ్ తో పాటు 128gb ufs 2.2 స్టోరేజ్ తో విడుదలైంది. 8జిబి వరకు Ram ను అదనంగా పొడిగించుకునే అవకాశం ఉంది. ఇక మైక్రోఎస్డీ కార్డు ద్వారా 1 TB గరిష్ట స్టోరేజ్ను పెంచుకునే అవకాశం ఉన్నట్టు వివో తెలిపింది. ఇక భారత్ మార్కెట్లో 8 జిబి రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టు వివో కంపెనీ తెలిపింది. ఇక సిల్క్ బ్లాక్ సిల్క్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ALSO READ : అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

కెమెరా : ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాను ఆధునికంగా తీర్చిదిద్దారు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ కెమెరాలతో వచ్చేసింది. ముందు వైపు సెల్ఫీ కెమెరా కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 44 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mh బ్యాటరీ సదుపాయం కలిగి ఉంది.

కనెక్టివిటీ – ఈ స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ 5.1, వైఫై ఓ టి జి ఛార్జింగ్ పోర్ట్స్ కు సపోర్ట్ చేసేదిగా ఉంది. ఇక జిపిఎస్, గెలీలియో, గ్లానోస్ వంటి ఫీచర్స్ ఉన్న సైతం సపోర్ట్ చేస్తుంది. గైరోస్కోప్, ఆక్సిలరో మీటర్ వంటి సెన్సార్ ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.

అత్యాధునిక భద్రత – ఈ స్మార్ట్ ఫోన్ లో హై స్టాండర్డ్ సెక్యూరిటీని వివో అమర్చింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. 54 రేటింగ్ తో డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 183 గ్రాములుగా ఉంది. ఇక హ్యాండ్ సెట్ డ్యూయల్ నానో సిమ్ కార్డ్ తో పని చేస్తున్నట్టు వివో కంపెనీ తెలిపింది.

ధర – భారత్లో ఈ స్మార్ట్ ఫోన్ 8gb ర్యామ్ ప్లస్ 128gb స్టోరేజ్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక దీని ధర రూ. 23,999గా వివో కంపెనీ నిర్ణయించింది. వివో ఈ స్టోర్స్ లో కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ బ్యాంకులతో కొనుగోలు చేసే కస్టమర్స్ కు రూ. 1000 తగ్గింపు పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

Related News

Apple iPad Mini : అదిరే ఫీచర్స్ తో ఐపాడ్ మినీ లాంఛ్.. స్పెసిఫికేషన్స్, ధర వివరాలివే!

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Android : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

Redmi : రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

Realme : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

Big Stories

×